నాగం జ‌నార్ద‌న్‌రెడ్డిపై డీకే వ‌ర్గం  ఫైర్‌!

టీడీపీ నుంచి సొంత‌పార్టీ.. అటువైపు నుంచి బీజేపీలోకి జంప్ చేసిన సీనియ‌ర్ నాయ‌కుడు నాగం జ‌నార్ద‌న్‌రెడ్డికి ఎదురుగాలి త‌ప్పేలా లేదు. స‌మ‌ర్ధుడైన నాయ‌కుడిగా పేరున్న నాగం.. ఎక్క‌డుంటే అక్క‌డ ఆగ‌మాగం అనే పేరు కూడా  ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత‌కాలం గౌర‌వంగానే ఉన్నారు. అధినేత చంద్ర‌బాబు ఆశీస్సులు కూడా పుష్క‌లంగానే ఉండేవి. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తెలుగుదేశం పోషించిన భిన్న‌మైన వైఖ‌రి కార‌ణంతో టీడీపీ కొంత వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఉద్య‌మ‌కారులు నాగంపై దాడికి దిగారు. అదృష్ట‌వ‌శాత్తూ.. ఆ ఘ‌ట‌న నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఇది త‌న‌కు పున‌ర్జ‌న్మంటూ ప‌లుమార్లు సంఘ‌ట‌న తాలూకూ అనుభ‌వాల‌ను ఉటంకించారు. కేంద్రంలో వున్న బీజేపీ పుణ్య‌మాంటూ అధికారాన్ని ఆస్వాదించ‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. అయితే అక్క‌డా ఇమ‌డ‌లేక‌పోయారు. కాంగ్రెస్ పీసీసీ నేత ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి రాయ‌భారంతో హ‌స్తంతో చేయి క‌లిపేందుకు నాగం ముందుకు వ‌చ్చారు. నాగం రాక‌తో పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌నే ఉద్దేశంతో హైక‌మాండ్ కూడా దీనికి ప‌చ్చ‌జెండా ఊపింది. అయితే.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన  మాజీ మంత్రి  డీకే అరుణ‌,  స‌త్య‌నారాయ‌ణ‌, వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి త‌దిత‌ర వ‌ర్గం మాత్రం నాగం రాక‌ను వ్య‌తిరేకిస్తున్నాయి. కేవ‌లం జ‌ైపాల్‌రెడ్డి  త‌న వ‌ర్గం బ‌ల‌ప‌డేందుకు ఇదొక ఎత్తుగ‌డ అనే ఆరోప‌ణ‌లున్నాయి. ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు ప్ర‌తికూలంగా మాట్లాడుతూ సంచ‌ల‌నానికి కార‌ణ‌మ‌య్యారు. ఇప్పుడు నాగంపై వ్య‌తిరేక‌త‌తో మ‌రోసారి పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు తెర‌లేపిన‌ట్ల‌యింది. అధికారం గ్యారంటీ అనుకుంటున్న త‌రుణంలో విబేధాలు.. ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తాయ‌నేది పార్టీవ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.