పవన్ అభిమానుల్లో విభేదాలు.. జనసేనకు దెబ్బేనా?

జనసేన.. పార్టీ అయితే ఏర్పాటు అయింది కానీ, ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. అధినేత పవన్ కల్యాణ్ ఒక్కరే అన్నీ తానే అయి చూసుకుంటున్నారు. ఎన్నికల సమయం ముంచుకొస్తున్నా.. జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారిగా అధ్యక్షులను కానీ, ఇన్‌చార్జ్‌లను కానీ నియమించలేదు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన పవన్.. ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా ఎంపిక చేయలేదు. ఫ్యాన్ బేస్‌గా ఏర్పాటయిన జనసేన పార్టీకి అభిమానులే కొండంత బలం. అభిమానులు లేకపోతే పార్టీ జెండా కూడా ఎక్కడా కనిపించదు. అలాంటిది ఇప్పుడు అభిమానుల మధ్య విబేధాలు బయటపడ్డాయి.

 

జనసేనకు చెందిన కిరణ్ రాయల్ తనపై దాడి చేశాడని చిత్తూరు జిల్లా పవన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు పసుపులేటి సురేష్ తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. తిరుపతి గురువారెడ్డి సమాధుల వద్ద తనపై నలుగురుతో కలసి కిరణ్ రాయల్ దాడి చేశాడంటూ సురేష్ ఆరోపించాడు. జనసేన పార్టీ‌లో ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి పదవులు లేవని… పార్టీని, పవన్ కల్యాణ్ పేరును అడ్డం పెట్టుకుని కిరణ్ రాయల్ తనపై దాడి చేశాడని పసుపులేటి సురేష్ మీడియా ముందు వాపోయాడు.

 

ఇవన్నీ చూస్తుంటే.. జనసేనలో సమన్వయం లోపించిందని, పవన్ కల్యాణ్ తప్ప మరోనేత ఏ విషయంలోనూ జోక్యం చేసుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది. అభిమానుల మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించేవారు ఎవరో ఒకరు లేకపోతే పార్టీకి ముప్పు తప్పదని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ పార్టీ అన్నాక.. ఒక్కొక్కరు ఒక్కోరకంగా పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప.. స్వప్రయోజనాల కోసం ఆరాటపడడం పార్టీకి మంచిది కాదని చెబుతున్నారు. అభిమానుల మధ్య ఇలాగే విబేధాలు కొనసాగితే పార్టీకి దెబ్బేనని అంటున్నారు. ఇలాంటి వివాదాలపై జనసేనాని పవన్ అసలు స్పందిస్తారో లేదో.. స్పందిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.