పవన్ లెక్కల్లో తేడాలు కొడుతున్నాయ్!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్  కళ్యాణ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల మధ్య విస్తృత పర్యటనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక పక్క టీడీపీనీ ఇంకో పక్క జగన్ మీద విమర్శలు చేస్తూ పార్టీ ప్రచారం సాగిస్తున్నారు. అయితే జనసేన గతంలో చేసిన ప్రకటనలో మార్పులు చేసి నేతలను ఆలోచనలో పడేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జనసేన నేతలు తమకు 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, వారంతా ఏ క్షణమైన తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించిందిన విషయం విదితమే. ఈ ప్రకటన ఒకటికి పదిసార్లు ప్రచారం చేశారనే వాదన వినిపిస్తోంది. అయితే జనసేన చెప్పిన వారిలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ ఆ పార్టీలో చేరారో ఎవరికీ తెలియడంలేదని సమాచాం. వివిధ పార్టీలకు చెందిన నేతలు కొందరు అక్కడ తమకు అవకాశం దక్కదని అర్థం చేసుకుని జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనే ఆశపడుతున్న నేతలు మాత్రమే జనసేనలోకి చేరుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
అయితే గతంలో తమతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పిన జనసేన నేతలు ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతోందట. మరి ఈ 20 మందిలో కూడా ఎంతమంది జనసేనలో చేరుతారో వేచిచూడకతప్పని పరిస్థితులున్నాయి. ఇదిలావుండగా జనసేన పార్టీ మీద కమ్యూనిస్టులు చాలానే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా వీలైనంత జనసేనను వీలైంతన పైకెత్తుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు జనసేన పార్టీవైపు చూస్తున్నారని స్వయంటా సీపీఎం కార్యదర్శి పి. మధు చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకేనని పేర్కొన్న మధు జనసేనతో ప్రస్తుతం ప్రజా సమస్యల పై కలసి పోరాటం చేస్తున్నామని మరోమారు తేల్చి చెప్పారు. అలాగే ఎన్నికల సమయంలో కుదుర్చుకునే  పొత్తులపైనకూడా చర్చలు జరుగుతాయయన్నారు. పనిలోపనిగా టీడీపీ, వైసీపీ మధ్య బందీయైన రాష్ట్రప్రజలకు మూడో ప్రత్యామ్నయంగా జనసేన ఏర్పడిందని తమ వాదన వినిపించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతంగా ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని కమ్యూనిస్టులు జనసేన మద్దతుతో ఎలాగైనా ఈ సారి చట్టసభలలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.