చంద్రబాబుకు, జగన్‌కు ఇదే తేడా

ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం జోరందుకుంది. రోజుకో ట్విస్టులతో ఏపీ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పాటించాల్సిన పనుల నుంచి నిలబెట్టే అభ్యర్ధుల విషయం వరకు అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించేశాయి. అయితే, టీడీపీ-వైసీపీ మధ్య అసలైన పోటీ జరిగే అవకాశం ఉండడంతో, ఏపీ సీఎం చంద్రబాబు గ్రామదర్శిని కార్యక్రమంతో, వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజాసంకల్పయాత్రతో ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతల్లో రాజకీయ అనుభవం ఎక్కువగా ఉన్న చంద్రబాబుపైనే ప్రజలు ఎక్కువ నమ్మకం పెట్టుకుని గత ఎన్నికల్లో గెలిపించారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్న జగన్.. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోడానికి, సీఎంను ఇరుకున పెట్టడానికి జగన్ ఎన్ని ప్రయత్నాలు సక్సెస్ కాకపోగా, అతడికే ప్రతికూలంగా మారుతున్నాయి. ఇలాంటి సందర్భంలో వీరిద్దరి మధ్య తేడా ప్రస్పష్టంగా కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన చంద్రబాబు, ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మిగిలిపోయిన జగన్, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కొన్ని టార్గెట్లు పెట్టుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. చంద్రబాబు.. వైసీపీకి కంచుకోటలుగా ఉన్న కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీని గెలిపించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ జిల్లాల్లోని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి ఆహ్వానించిన ఆయన అభివృద్ధితో అక్కడి ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయా జిల్లాల్లో టీడీపీ గ్రాఫ్ కొంతమేర పెరిగిందని పలు సర్వేల్లో తేలింది. అలాగే జగన్ కూడా గోదావరి జిల్లాలో జయకేతనం ఎగురవేయాలని అనుకున్నాడట. ఇందులో భాగంగానే ఆ రెండు జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో పాటు, ప్రజాసంకల్పయాత్రను ఎక్కువ రోజులు నిర్వహిస్తున్నాడని తెలిసింది. అయితే, ఇక్కడ జగన్‌ పాదయాత్రకు స్పందన అంతంతమాత్రంగానే ఉండడంతో పాటు, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో అతడిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో అక్కడ మరోసారి నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీని బట్టి చూస్తే.. చంద్రబాబుకు, జగన్‌కు మధ్య ఉన్న తేడా ఇదేననే అక్కడి జనాలు మాట్లాడుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.