దేవినేని వ‌ర్సెస్ వ‌ల్ల‌భ‌నేని!

ఒక‌రిది మైల‌వ‌రం.. మ‌రొక‌రిది గ‌న్న‌వ‌రం. ఇద్ద‌రూ ఒకే పార్టీ నేత‌లు.. మ‌రీ చెప్పాలంటే.. టీడీపీలో బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్న నాయ‌కులు. ఈ పాటికే అర్ధ‌మై ఉంటుంది.. వీరిద్ద‌రూ ఎవ‌ర‌నేది.. ఎస్‌.. మైల‌వ‌రం నుంచి గెలిచిన దేవినేని ఉమామ‌హేశ్వ‌రరావు.. మ‌రొక‌రు గ‌న్న‌వ‌రం నుంచి విజ‌యం సాధించిన వ‌ల్ల‌భ‌నేని వంశీ. వాస్త‌వానికి వంశీ సినిమా నిర్మాత కూడా. పైగా.. జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌కు అత్యంత ఆప్తుడు.. ఇంకా చెప్పాలంటే.. ఇప్ప‌టికీ జూనియ‌ర్‌తో బాగా ట‌చ్‌లో ఉన్న టీడీపీ నాయ‌కుల్లో వంశీ మొద‌టివ‌రుస‌లో ఉంటారు. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంతోపాటు.. జిల్లాలో కూడా మంచిప‌ట్టున్న నేత‌. కమ్మ వ‌ర్గంలోనే గాకుండా.. బీసీ వ‌ర్గాల్లోనూ పేరున్న నాయ‌కుడిగా.. చంద్ర‌బాబునాయుడు స్వ‌యంగా మెచ్చుకున్నారు. ప‌లు అభివృద్ధి ప‌థ‌కాల అమ‌లులో వంశీను చూసి నేర్చుకోవాలంటూ ప‌లు మార్లు ఎమ్మెల్యేల‌కు ఉదాహ‌ర‌ణ‌గా కూడా చూపారు. దేవినేని ఉమా.. అన్న ర‌మ‌ణ వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. త‌న‌కంటూ ఇమేజ్ తెచ్చుకున్నాడు. సాగునీటి మంత్రిగా.. ప్రాజెక్టుల్లో కీల‌కంగా మారారు.. పోల‌వ‌రం నిర్మాణంలో ఉమా క‌ష్టం చాలా ఉంది.

 

ఇటువంటి ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌ట‌. పైగా వంశీ మాట‌ల‌ను.. క‌నీసంఅధికారులు కూడా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ట‌. ఎందుక‌ని నిల‌దీస్తే.. ఇది మంత్రి ఉమా ఆర్డ‌ర్ అంటూ వంశీ ముఖానే చెప్పేస్తున్నార‌ట‌. పైగా.. సీఎం గ‌న్న‌వ‌రం, రామ‌వ‌ర‌ప్పాడు త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌కు వచ్చినా అధికార పార్టీ ఎమ్మెల్యేగా వంశీకు స‌మాచారం కూడా ఇవ్వ‌ట్లేద‌ట‌. దీనంత‌టికీ కార‌ణం ఉమానే అనేది వంశీ వ‌ర్గం ఆరోప‌ణ‌. రాజ‌కీయంగా త‌న‌కు ధీటుగా ఎదిగేవారిని తొక్క‌టంలో ఉమా ముందు ఉంటాడంటూ.. కృష్ణాజిల్లాలో సొంత‌పార్టీ నేత‌లే దుమ్మెత్తి పోస్తుంటారు. ఇప్పుడు ఏకంగా వ‌ల్ల‌భ‌నేని వ‌ర్గం.. సీఎంకు ఫిర్యాదు చేసేంత వ‌ర‌కూ చేరారు. ఇప్ప‌టికే.. నాలుగు గ్రూపుల‌తో.. ఎవ‌రికి వార‌న్న‌ట్లుగా.. టీడీపీ ఇబ్బందిప‌డుతుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇవి మ‌రింత ముదిరి.. త‌ల‌నొప్పిగా మారితే. పార్టీకే ఇబ్బంద‌నేది.. తెలుగు త‌మ్ముళ్ల ఆవేద‌న‌.. మొన్న‌టికి మొన్న‌.. క‌డ‌ప‌లో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి.. ఏకంగా ఎంపీ సీఎం ర‌మేష్‌ పై తిరుగుబావుటా ఎగుర‌వేశారు. సీమ‌లో కాబ‌ట్టి లైట్‌గా తీసుకున్నారు.. అదే కృష్ణాలో కూడా అటువంటి వాతావ‌ర‌ణం నెల‌కొంటే.. విప‌క్షానికి మ‌రో అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అనేది.. స‌గ‌టు టీడీపీ అభిమానుల సూచ‌న‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.