‘దేవినేని చరిత్ర’పై అనుచరులేమంటున్నారంటే?

ఏపీలోని మైలవరం ‘దేవినేని’ నియోజకవర్గంగా ముద్రపడిందంటున్నారు ఆయన అనుచరులు. దేవినేని ఉమ త్వరలో హ్యాట్రిక్‌ సాధించి చరిత్రలో నిలిచిపోతారనివారు బాహాటంగా చెబుతున్నారు. విజయవాడకు సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం అధికంగా కనిపిస్తుంటుంది. మంత్రి గత సంవత్సరం నుంచి మైలవరంపై ప్రత్యేక దృష్టిపెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందే విధంగా చేయడంలో సఫలీకృతులయ్యారని స్థానికులు కితాబిస్తున్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు 1999లో విజయం సాధించినా, 2004లో ఓడిపోయి..రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు టిడిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వడ్డే ప్రభావం మైలవరంలో ఎంత వరకు పనిచేస్తుందో తెలియడంలేదు. ‘వడ్డే’నే కాదు.. కాంగ్రెస్‌ అభ్యర్థుల వారసులందరూ కలసి పనిచేసినా… మంత్రి ఉమను ఓడించడం అసాధ్యమని స్థానిక సంస్థల ప్రతినిధులు చెబుతున్నారట. 
ఇదిలావుండగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్‌ మొదట టిడిపిలో చేరినా,  ఇటీవల వైకాపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మైలవరం నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. కాగా మంత్రి ఉమను ఓడించాలనే పట్టుదలతో వై.ఎస్‌ జగన్‌ ఉన్నారని తెలుస్తోంది. ‘కమ్మ’ సామాజికవర్గానికి చెందిన ‘కృష్ణప్రసాద్‌’ను బరిలోకి దింపనున్నారు ‘జగన్‌’. రాజకీయంగా ‘వసంత’ కుటుంబం ప్రజలకు దూరమైందని తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి వడ్డేతో పాటు మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, వారి వారసులు, తాజాగా ‘వసంత’ కుటుంబం ఏకమై మంత్రి దేవినేని ఓడించగలుగుతారా..? అనే విషయంపై మైలవరంలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో మెజార్టీ తగ్గినా మంత్రి ఉమ హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని స్థానికులు అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లాలో వరుసగా మూడుసార్లు విజయం సాధించి చరిత్ర సృష్టించింది దివంగత దేవినేని నెహ్రూ. టిడిపి అభ్యర్థిగా నాలుగసార్లు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఒకసారి ‘దేవినేని’ విజయం సాధించారు. ప్రస్తుతం ‘దేవినేని’ కుటుంబం మొత్తం టిడిపిలో చేరిన నేపథ్యంలో మైలవరం ‘ఉమ’ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుస్తోంది. ఎవరెన్ని ఛెప్పినప్పటికీ ప్రజల నాడి ప్రకారమే ఫలితాలుంటాయనేది జగమెరిగిన సత్యమంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.