ఎంపీగా పోటీ చేయనున్న టీడీపీ సీనియర్ నేత

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి ప్రారంభమైంది. రానున్న ఎన్నికల్లో హోరాహోరీగా తలపడేందుకు పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న పరిస్థితులు ఉండడం వల్ల అక్కడి పార్టీలు సమీకరణాలకు తగ్గట్లు అడుగులు వేస్తున్నాయి. ఏపీలో ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ నెలకొని ఉన్న సందర్భంగా ఆ పార్టీలు అభ్యర్ధుల ఎంపిక విషయంలో కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నగా ఉంది. బరిలో ఉండే అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించేందుకు అక్కడి పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. మరో రెండు నెలల్లోగా అభ్యర్థులను ప్రకటించి, నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీలన్నీ ఎన్నికల కోసం గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో.. విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి.

విభజన తర్వాత రాష్ట్రంలో క్యాడర్ ఉన్నా నాయకత్వలేమితో బాధపడుతోంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ సారి ఎన్నికల్లో ఎలాగైన ప్రభావం చూపించాలని నిర్ణయించుకున్నారు ఆ పార్టీ నేతలు. అందుకోసమే అసెంబ్లీలో పాటు, రాష్ట్రంలోని ముఖ్యమైన పార్లమెంట్ స్థానాలపై కన్నేశారు. అందులో ముఖ్యంగా దేశంలోనే పెద్దదైన మల్కాజిగిరి స్థానాన్ని గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్లారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ విజయం సాధించారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. సో, సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిని మరోసారి దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసమే, సీనియర్ నేత దేవేందర్‌గౌడ్‌ను తమ అభ్యర్ధిగా నిలబెట్టాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఈ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. అయినా, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న దేవేందర్‌గౌడ్.. అక్కడ పట్టు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.