ఓడినా డిప్యూటీ సిఎం అతనిదే…

కర్నాటకలో గాలి సోదరుల హవా తెలియంది కాదు. గాలి ప్రధాన అనుచరుడు బళ్లారికి చెందిన శ్రీరాములు రెండు చోట్ల పోటీ చేశారు. అందులో ఒకటి మొలకాల్మూరు కాగా.. మరొకటి బాదామి. అతనిలానే సిఎం సిద్దరామయ్య రెండు చోట్ల పోటీ చేశాడు. ఇందులో చాముండేశ్వరిలో సిద్దరామయ్య ఓడిపోగా.. బాదామిలో గెలిచారు. బాదామిలో సిద్దరామయ్యను ఓడిస్తానని చెప్పిన శ్రీరాములు అక్కడ పరాజయం పాలయ్యారు. కానీ మొలకాల్మూరులో గెలవడంతో ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు అయింది. సిఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనుండగా.. డిప్యూటీ సిఎంగా శ్రీరాములు కుర్చీ ఎక్కనున్నారు. 
ఒక చోట ఓడినా మరోచోట గెలవడంతో సిద్దరామయ్య, శ్రీరాములు బతికిపోయారు. లేకపోతే ఇద్దరి పరువు తుంగభద్రనదిలో కలిసేది. తానే సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఎన్నికల పోలింగ్ నాడు చెప్పిన సిద్దు పోలింగ్ తర్వాత నిరాశలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దళితుడ్ని సిఎం చేస్తానని చెప్పడం వెనుక కారణం ఓటమితో కూడిన నిరాశ అంటున్నారు. విషయం ఏదైనా ఇప్పుడు బళ్లారి నియోజకవర్గంలో తిరిగి గాలి సోదరుల హవా పెరగనుంది అన్నది వాస్తవం. హరప్పనహళిలో గాలి కరుణాకరరెడ్డి గెలిచారు. మైనింగ్ మాఫియా అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేసినా ఓటర్లు పట్టించుకోలేదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.