శుభకార్యానికి డేట్ ఫిక్స్ చేసిన రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌. బాహుబలి సిరీస్‌తో తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటాడు. దీంతో అతడి పేరు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాక మారుమ్రోగిపోయింది. రాజమౌళితో సినిమా తీయాలని అటు నిర్మాతలు.. ఇటు హీరోలు క్యూ కడుతున్నారంటే అతడి ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. సహజంగా రాజమౌళికి సంబంధించినంతవరకూ ఆయన సినిమాల గురించి మాత్రమే ఎక్కువ ఫోకస్ అవుతుంటాయి. కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం విషయాలు బయటకు రావు. కానీ, ఆయన కుమారుడి విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతుంటాయి. అతడు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా ఇట్టే తెలిసిపోతుంటుంది. అన్నీ తెలిసినా.. అతడి లవ్ స్టోరీ గురించి మాత్రం ఎవరికీ తెలియలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న అతడి నిశ్చితార్థం జరిగిన విషయం బయటికొచ్చిన తర్వాతే ప్రేమ గురించి కూడా వెలుగులోకొచ్చింది. కొద్దిరోజుల క్రితం కార్తికేయ నిశ్చితార్థం జరిగింది. అది కూడా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలోనే. అయితే, ఎంతో రహస్యంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సన్నిహితులు మాత్రమే హజరయ్యారు.

ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, సీనియర్ నటుడు జగపతిబాబు అన్న కూతురు పూజా ప్రసాద్‌తోనే కార్తికేయ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. భక్తి గీతాలతో గాయనిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న పూజా ప్రసాద్.. ‘జగపతి’ రాజేంద్ర ప్రసాద్ పెద్ద కుమారుడు రాంప్రసాద్ కుమార్తె. పూజ-కార్తికేయ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించడంతో.. ఫిలింనగర్‌లోని అమ్మాయి ఇంట్లో నిశ్చితార్థం జరిపారు. నిశ్చితార్థం రహస్యంగా జరిగినా.. వివాహం మాత్రం అంగరంగ వైభవంగా చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అందుకే పెళ్లిని గ్రాండ్‌గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా 2019 జనవరి 5న కార్తికేయ, పూజల వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో పెళ్లి ఘనంగా జరగనున్నట్లు, దీనికి ఇండియాలోని సినీ, రాజకీయ ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి.. చరణ్-తారక్ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.