దాస‌రి కుర్చీలో మెగాస్టార్‌!

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు కేవ‌లం ఒక ద‌ర్శ‌కుడిగానే కాదు.. తెలుగు సినిమాకు పెద్ద‌దిక్కుగా ఉన్నారు. నిర్మాత‌ల నుంచి న‌టీన‌టుల వ‌ర‌కూ ఏ ఒక్క‌రికి క‌ష్ట‌మొచ్చినా.. స‌ర్దుబాటు చేసేందుకు ఆయ‌న ఉన్నాడ‌నే భ‌రోసా క‌ల్పించారు. అదే స‌మ‌యంలో కాపు సామాజిక‌వ‌ర్గ నేత‌గా ఆ వ‌ర్గానికి కూడా అందుబాటులో ఉండేవారు. పైగా.. కాపు రిజ‌ర్వేష‌న్స్‌కు ధైర్యంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయినా ఏనాడు కులం రంగు అంట‌కుండా కొన‌సాగుతూ పెద్ద‌రికాన్ని సొంతం చేసుకున్నారు. లావు త‌గ్గేందుకు ఆయ‌న చేయించుకున్న బేరియాట్రిక్ స‌ర్జ‌రీ విక‌టించ‌టంతో అక‌స్మాత్తుగా అనారోగ్యానికి గురై మ‌ర‌ణించారు. అప్ప‌టి నుంచి తెలుగు సినిమాకు పెద్ద‌త‌లకాయ లేకుండా పోయింద‌నే బాధ వినిపిస్తూనే ఉంది.
సూప‌ర్‌స్టార్ కృష్ణ సీనియ‌రే అయినా.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న ఇల్లు క‌ద‌ల‌కుండా ఉన్నారు. ముర‌ళీమోహ‌న్‌, కృష్ణంరాజు వంటి పెద్ద‌లున్నా పూర్తిస్థాయిలో వారికి సినీ ఇండ‌స్ట్రీలతో సంబంధాలు కొన‌సాగ‌ట్లేదు. రాజ‌కీయంగా కూడా వారివి భిన్న వాద‌న‌లు. ఇక మిగిలింది మోహ‌న్‌బాబు, చిరంజీవి, బాల‌య్య‌, వెంక‌టేష్‌, నాగార్జున వంటి 80 నాటి హీరోలు. వీరంతా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్ప‌టికీ నెంబ‌ర్‌వ‌న్‌గా వున్న చిరంజీవి.. దాస‌రి కుర్చీ కోసం కాస్త ఆస‌క్తి చూపుతున్న‌ట్లు సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య‌నే రెండుకోట్ల రూపాయ‌లు హోమియా ఆసుప‌త్రి నిర్మాణానికి రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్‌కు అంద‌జేశారు. గుప్త‌దానాలు కూడా విరివిగానే చేస్తున్నారు. కొత్త సినిమా రిలీజ్ వేడుక‌లు, చిత్ర యూనిట్ స‌త్కారాల‌తో వెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తున్నారు. పైగా 150 సినిమా ఖైదీనెంబ‌ర్ 150 జీరో ఊపుతో సైరా అంటూ.. పెద్ద సినిమాను కోట్లు కుమ్మ‌రించి మ‌రీ నిర్మిస్తున్నారు. అంతేగాకుండా.. ఇండ‌స్ట్రీలో కూడా చిరుపై పాజిటివ్ ఒపీనియ‌న్ వినిపిస్తుంది. పైగా కాంగ్రెస్ పార్టీకూ దూరంగా ఉంటున్నారు. దీంతో ఇప్పుడు తాను ఏ పార్టీకు చెందిన వాడిని కాద‌నే అభిప్రాయాన్ని సినీవ‌ర్గాల్లోకి తీసుకెళుతున్నారు. మ‌రి.. ఈ లెక్క‌న అన్నీ క‌లిసొస్తే. మెగాస్టార్‌.. ఖాళీగా వున్న దాస‌రి పెద్ద పోస్టును సొంతం చేసుకున్న‌ట్లేనంటూ ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.