డాలస్ లో ఉభయ గోదావరి జిల్లాల ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం

డాలస్ లో ఆదివారం (June 10th 2018) నాడు జరిగిన ఉభయ గోదావరి జిల్లాల ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గారు, తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ గారు మరియు టి.నర్సాపురం జడ్పీ సభ్యుడు నల్లూరి చలపతిరావు గారు పాల్గొన్నారు. ఈ సమావేశం లో డాలస్, ఆస్టిన్, హ్యూస్టన్, డిట్రాయిట్, మినియాపోలిస్, సాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా మరియు ఇతర నగరాల నుండి వచ్చిన ఉభయ గోదావరి జిల్లాల ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సమావేశం లో పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ తరపున చేపడుతున్న High School Digitization project గురుంచి వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 250 ZP High Schools కి digitization సౌకర్యం కల్పించుటకు ఏర్పాటు చేయబడుతుంది. దీని కొరకు జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గారికి Godavari NRIs Organization తరుపున 10 లక్షల రూపాయల విరాళం Dr.చౌదరి ఆచంట, Dr.సుబ్బా యంత్ర (president Godavari NRIs), రాంప్రసాద్ చిలుకూరి(treasurer Godavari NRIs) మరియు సుమంత్ పుసులూరి(secretary Godavari NRIs) అందచేయడం జరిగినది. దీనికి సహకరించిన దాతలు అందరికి కృతజ్ఞతలు. ఈ సమావేశం లో కుమార్ పిచికల, స్వామి కాకర్ల, నాగు ఉప్పులూరి,చంద్రశేఖర్ , బాల నాగేస్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.