ముహూర్తాలు- ఈరోజు ఎవ‌రికి మంచిది !?

ద‌శాబ్దం గ‌డిచింది. *న‌మ‌స్తే ఆంధ్ర* శైలికి ప్ర‌త్యేక పాఠ‌క వ‌ర్గం ఉంది. ఇంత‌కాలం మాతో క‌లిసి ప్ర‌యాణిస్తూ మ‌మ్మ‌ల్ని ఆద‌రిస్తున్న మా ప్రియ పాఠ‌కుల‌కు ఈరోజు నుంచి ఉప‌యుక్త‌మైన ఒక కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాం. మ‌న‌లో చాలా మంది కొత్త వ్యాపారాలు ప్రారంభించ‌డానికి, ఉద్యోగాలు చేయ‌డానికి, కొత్త ప‌నిలో చేర‌డానికి లేదా ఏదైనా ఇంట్లో శుభ‌కార్యం చేయ‌డానికి ఒక ముహుర్తం చూసుకోవ‌డం అల‌వాటు. మంచి ప‌నికి ప్ర‌తి రోజు మంచి రోజే అని నానుడి. పాజిటివిటీ మనిషికి ఎపుడూ మేలే చేస్తుంది. అయితే, ముహూర్తాలు ఫాలో అవ‌డం వ‌ల్ల హాని లేనపుడు, అవ‌కాశం ఉన్న‌పుడు దానిని పాటించ‌డంలో త‌ప్పులేదు క‌దా. 
అందుకే ఇక నుంచి ప్ర‌తి రోజు ఉద‌యం *ఏ న‌క్ష‌త్రం వారికి ఆరోజు మంచిదో* వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తాం. అదేమీ బ్ర‌హ్మ విద్య కాదు. కొంచెం శ్ర‌ద్ధ పెట్టాలంతే. మీరు కూడా చూసుకోవ‌డం సులువే. ముహుర్తాలు న‌క్ష‌త్ర బ‌లాల ఆధారంగానే పెడ‌తారు. ప్ర‌తి న‌క్ష‌త్రానికి అనుకూల తార‌లు, సాధార‌ణ తార‌లు, ప్ర‌తికూల తార‌లు ఉంటాయి. మీ న‌క్ష‌త్రానికి అనుకూల తార‌లు ఉన్న‌పుడు ప‌ని ప్రారంభించినా, శుభ‌కార్యం చేసినా స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుందంటారు. మీకు ఏ శ్ర‌మా లేకుండా ప్ర‌తిరోజు *ఈరోజు ఎవ‌రికి మంచిది*  అనే శీర్షికన ఉద‌యాన్నే ఒక ఆర్టిక‌ల్ ప్ర‌చురిస్తాం. ఇది మీకు ఉప‌యుక్తంగా ఉంటుంది. 

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.

 

అక్టోబ‌రు 24, బుధ‌వారం 

* తిథి- పౌర్ణ‌మి (మంచిది)

* 11.36 నుంచి 1.26 మ‌ధ్య ఏ ప‌నులు చేయ‌కండి.

* ఉద‌యం 9.23 త‌ర్వాత రాత్రి ప‌ది గంట‌ల‌ వ‌ర‌కు
భరణి, కృత్తిక, మృగ‌శిర‌, ఆశ్లేష‌, పునర్వసు, పూర్వ‌ఫ‌ల్గుని, ఉత్త‌ర ఫ‌ల్గుని, చిత్త‌, విశాఖ, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, ఉత్తారాషాడ‌, ధనిష్ట‌, పూర్వభాద్ర‌, రేవతి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి మంచిది. వీరు ఈ రోజు మొద‌లుపెట్టే ప‌నులు స‌త్ఫలితాల‌ను ఇస్తాయి.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.