ఎన్డీఏలో భారీ సంక్షోభం

ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ, శివసేన, గూర్ఘండ్ జన్ ముక్తి మోర్చాలు బయటకు వెళ్లాయి. ఫలితంగా బీజేపీ హవా తగ్గింది. లోక్ సభలో ఆ పార్టీ మెజార్టీ ఇప్పుడు 272కు చేరిన సంగతి తెలిసిందే. ఇద్దరు నామినేటెడ్ సభ్యులు అదనంగా ఉన్నప్పటికీ కమలం కలరవర పడుతోంది. సాధారణ మెజార్టీకి కేవలం రెండు సీట్ల తేడాతోనే ఉంది కమలం పార్టీ. 2014 ఎన్నికల తర్వాత 27 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీవి 13 స్థానాలు. వాటిలో 8 సీట్లను కమలం పార్టీ పోగొట్టుకుంది. కేవలం ఐదు సీట్లను దక్కించుకుంది. ఫలితంగా బీజేపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి.

కర్నాటకలో దెబ్బ తినడం, ఉప ఎన్నికలు జరిగిన 14 సీట్లకు గాను…11 చోట్ల ఓడింది. మహారాష్ట్రలో గెలిచిన పాత స్నేహితుడు శివసేనను ఓడించింది. అంతే…మిగతా చోట్ల కమలం చతికల పడిన సంగతి తెలిసిందే. యూపీలో గతంలో పూల్పూర్, గోరఖ్ పూర్ ను ఓడిపోగా..తాజాగా కైరానాలోను దెబ్బ తగిలింది. ఇక రానున్న రోజుల్లో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లలో ఎన్నికలు రానున్నాయి. ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్ తోపాటు..మిగతా పార్టీలు కూటమి కట్టనున్నాయి. బీజేపీకి వైరి వర్గంగా ఏర్పడనున్నాయి.

బీహార్ లో తోడుగా ఉంటాడనుకున్న నితీష్ కుమార్ ఎదురు తిరుగుతున్నాడు. హోదా కావాలని పాత పాట పాడుతున్నాడు. ఫలితంగా ఇబ్బంది వచ్చి పడింది. సంఘ్ పరివార్ నుంచి మోడీ, అమిత్ షా వైఖరి పై వ్యతిరేకత పెరుగుతుందంటున్నారు. ఫలితంగా బీజేపీకి ఎదురు గాలి తగులుతుందనే చెప్పాలి. కథువా సంఘటన తర్వాత బీజేపీ, ఎల్జీపీ మధ్య వివాదం నడుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడ నిందితులుగా ఉండటం ఇబ్బంది కలిగించే అంశమే. బ్యాంకు కుంభకోణాలు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యుపిఏ కూటమిలోని 47 పార్టీల్లో 13 పార్టీలకు లోక్ సభలో సభ్యత్వం ఉంది. మిగతా పార్టీలకు సీట్లు లేకపోయినా తమ బలం చూపించేందుకు సిద్దమవుతున్నాయి. టీడీపీ, శివసేనలు బీజేపీ పై విమర్శలు గుప్పించడంతో గుక్క తిప్పుకోలేక పోతోంది కమలం పార్టీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.