పవన్‌ను డిమాండ్ చేయరట

ఎన్నికలు సమీపిస్తున్నందును ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలన్నీ స్పీడు పెంచేశాయి. అధికార తెలుగుదేశం పార్టలన్నీ ఒకవైపు.. మిగతా పార్టీలన్నీ మరోవైపు ఉండడంతో అన్ని పార్టీలు టీడీపీనే టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తోడు జనసేన పార్టీలో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు సర్వే ఫలితాల్లో తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. వామపక్షాల పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా తయారయింది. దశాబ్ధాలుగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ పార్టీలు గత ఎన్నికల్లో ఏపీలో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. సీపీఐ, సీపీఎంలు 2014 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా, ఒంటరిగా ముందుకు సాగినా ఫలితాలు మాత్రం ఏ మాత్రం అనుకూలించలేదు. కాని గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాపోరాటాన్ని కొనసాగించడమే లక్ష్యంగా తీసుకున్నాయి. దీంతో ఈ సారి కలిసికట్టుగా సాగడంతో పాటు, మరో బలమైన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో కలివిడిగా ఉంటున్నాయి. ఆ పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమయ్యాయి.

గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన పవన్.. ఉన్నట్లుండి ప్రభుత్వంపై పోరాటాన్ని ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జనసేనాని చెప్పినట్లుగా అప్పటి నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే ఆ పార్టీకి వామపక్షాలు దగ్గరయ్యాయి. పవన్ ఏ పోరాటానికి పిలుపునిచ్చినా.. దానికి వామపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. దీని ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని బాగా ప్రచారం కూడా జరిగింది. దీనిని నిజం చేస్తూ వామపక్షాల నేతలు వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి నడుస్తామని, తమ ఉమ్మడి సీఎం అభ్యర్ధి పవన్ కల్యాణే అంటూ ప్రకటించాయి. దీంతో 2019లో ఈ పార్టీల మధ్య పొత్తు కన్ఫార్మే అని తెలుస్తోంది. వామపక్షాలు గత ఎన్నికల అనుభవాలను గుర్తు చేసుకునే ఇప్పుడు కలిసి ఉంటున్నాయట. అందుకే జనసేనతో పొత్తు నిర్ణయానికి ముందు సీపీఎం, సీపీఐ పార్టీలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నాయని టాక్ వినిపిస్తోంది. కచ్చితంగా జనసేనతో పొత్తు పెట్టుకుని సీట్ల పంపకం విషయంలో మాత్రం తుది నిర్ణయం పవన్‌కు వదిలేద్దామని, ఇన్ని సీట్లే కావాలని డిమాండ్ చేయొద్దని ఆ పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.