వైసీపీతో సీపీఐ పొత్తు

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో ఇప్పుడిప్పుడు క్లారిటీ వస్తోంది. మొన్నటి దాకా జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేశాయి. పవన్ తో పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుందని ఆలస్యంగా తెలుసుకున్నాయి. అసలే చిన్న పిల్లాడి ఆటలా ఉంది పవన్ వ్యవహారం. తనను కలిసేందుకు వచ్చిన కామ్రేడ్స్ ను నలబై నిమిషాల పాటు బయట నిలబెట్టి సినీ హీరో అనిపించుకున్నారు పవన్. అప్పటి నుంచి పవన్ అంటే వారికి నమ్మకం కుదరడం లేదట. ఆ సంగతి లైట్ తీసుకున్నా.. అసలు విషయం వారిని వేరు చేసిందట. అదేనండి. బీజేపీతో పవన్ లోపాయికారీ పొత్తు. టీడీపీని ఇరగతిట్టే పవన్.. బీజేపీని ఒక్క మాట అనడం లేదు. కమలం పార్టీ అంటేనే కమ్యూనిస్టులకు అసలు పడదు. అది మతతత్వ పార్టీగానే వారు చూస్తారు. అసలు విలువనివ్వరు. అలాంటిది జనసేన.. వారితో వెళుతుంటే మన దారి మనం చూసుకోవడం మంచిదనే ఆలోచనకు వచ్చారట. 
ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశాక పవన్ కల్యాణ్ సీన్ ఏంటో జనాలకు బాగా అర్థమైంది. లోక్ సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాష్ నారాయణకు బాగా అర్థమై బయటకు వెళ్లారు. ఆ తర్వాత మిగతా వారు పవన్ తీరుతో ఆశ్చర్యపోయారు. మొత్తంగా పవన్ కల్యాణ్ ఎవరికీ అర్థం కాని వ్యక్తిగా మారాడు. ఎప్పుడు ఏం చేస్తాడో మిగతా వారికే కాదు.. ఆయనకు తెలియదట. కాసేపు పుస్తకాలు రెండు లక్షలు చదివాడంటారు. మరికాసేపు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బాగున్నాయంటాడు. ఆ తర్వాత చిన్న పిల్లాడిలా మాట్లాడతాడు. అవినీతి ప్రభుత్వాలు అని చెబుతాడు. అందుకే సిపిఐ, సిపిఎంలు తమ దారి తాము చూసుకుంటున్నాయి. ముఖ్యంగా సిపిఐ వైకాపాతో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 
విశాఖలో జరిగిన నిరసన దీక్ష సభలో సిపిఐ రామకృష్ణ పాల్గొన్నారు. వైకాపాకు మద్దతునిచ్చారు. ఫలితంగా రాబోయే కాలంలో సిపిఐ, వైకాపాలు కలిసి పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది. సిపిఎం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి పవన్ తో వెళ్లే ఆలోచన లేదనేది మాత్రం వారు చెబుతున్నారు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.