టీడీపీలో.. కోవ‌ర్టులా.. ఇంటిదొంగ‌లా!

ఒక్క‌డే న‌డ‌వాలి.. ఒక్క‌రే క‌ష్ట‌ప‌డాలి.. ఆయ‌నొక్క‌డే పార్టీను న‌డిపించాలి. మ‌రి మిగిలిన వారేం చేస్తారు.. బిజినెస్‌లు న‌డుపుకుంటారు. ప‌క్క‌పార్టీల‌తో దోస్తీచేస్తారు. ఇంటిగుట్టు అప్పుడ‌పుడూ తాక‌ట్టుపెడ‌తారు. ఎస్‌.. ఇదంతా ఏపీలో తెలుగుదేశం పార్టీ నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌పై పెల్లుబుకుతున్న విమ‌ర్శ‌లు. స్వ‌యంగా.. అధినేత చంద్ర‌బాబునాయుడు వ‌ద్ద ఉన్న నివేదిక‌. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలవాల్సిన ప‌రిస్థితి. దీనికోసం బాబు ఇప్ప‌టి నుంచే వ్యూహాల‌కు ప‌ద‌నుపెడుతున్నారు. పార్టీలో ఉన్న త‌ప్పిదాలు.. త‌ప్పుడు నేత‌ల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌న్న వ‌ద్ద‌కు ముందుకు కొంద‌రు సీనియ‌ర్ మంత్రులు, ఎమ్మెల్యేల జాత‌కాలు.. అధినేత‌కు త‌ల‌నొప్పి తెప్పించాయ‌ట‌. పైగా వీళ్లేనా.. ఇన్నేళ్లు పార్టీలో ప‌ద‌వులు అనుభ‌వించింద‌నే ఆందోళ‌న కూడా క‌లిగిందట‌. దీనంత‌టికీ కార‌ణం.. రాయ‌ల‌సీమ‌, కోస్తా జిల్లాల్లోని ప్ర‌జాప్ర‌తినిధుల్లో చాలామందికి వైసీపీ నేత‌ల‌తో మంచి అండ‌ర్ స్టాండిగ్స్ కూడా ఉన్నాయ‌ట‌. వ్యాపార వ్య‌వ‌హారాల్లో అంద‌రూ అంద‌రే అన్న‌ట్టుగా క‌ల‌సిమెల‌సి సాగుతున్నారు. కొన్నిచోట్ల త‌మ పార్టీ కంటే వైసీపీ నేత‌ల‌కే రెడ్‌కార్పెట్ ప‌రుస్తున్నార‌ట‌.
పైగా త‌మ వ‌ద్ద ఎటువంటి విష‌యం దాప‌రికం లేద‌నేంత‌గా సావాసం చేస్తున్నార‌ట‌. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే. ఒక‌వేళ 2019 ఎన్నిక‌ల్లో త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌క‌పోతే.. సొంత‌పార్టీను ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌తో క‌ల‌సి దెబ్బ‌తీసేందుకు కొంద‌రు బ‌రితెగించేంత వ‌ర‌కూ చేరార‌ట‌. వీరిలో సీనియ‌ర్ మంత్రి, ఇద్ద‌రు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇలా 20 మంది వ‌ర‌కూ ఉన్నార‌ని స‌మాచారం. పార్టీ అంత‌ర్గ‌తంగా చ‌ర్చించే విష‌యాల‌ను కూడా ప్ర‌త్య‌ర్థి చెవిలో ఊదేస్తున్నార‌నేది మ‌రో ఆందోళ‌న క‌లిగించే అంశం. సీనియ‌ర్ మంత్రి ఒకాయ‌న‌.. పార్టీకు అన్నీ తానేనంటూ.. వైసీపీ సీనియ‌ర్ నేత‌లు.. వారి పుత్ర‌ర‌త్నాల‌తో వ్యాపార‌ లావాదేవీలు చేస్తున్నార‌ట‌. వారికి ఏ క‌ష్టం వ‌చ్చినా.. ఆఫ్ ది రికార్డుగా అధికారులకు ఫోన్‌చేసి.. మ‌నోళ్లే కాస్త‌ చూడీచూడ‌న‌ట్టు పోండి అంటూ చెబుతున్నార‌ట‌. దీంతో.. వీరంతా టీడీపీ లో ఉంటూ.. విప‌క్ష నేత‌కు సాయ‌ప‌డుతున్న కోవ‌ర్టులా.. తిన్న ఇంటి వాసాలు లెక్క‌పెట్టే ఇంటిదొంగలా అంటూ.. పాపం పార్టీ జెండా మోయ‌ట‌మే గొప్ప‌గా భావించే కార్య‌క‌ర్త‌ల అభిప్రాయం. పైగా పక్కా ఇళ్ల నిర్మాణం, రుణాల మంజూరు విష‌యంలో కూడా నేత‌లు.. కాసుల యావ‌కు దిగ‌జారుతున్నార‌ట‌. ఇలాంటి వారిలో కొంద‌రు ఎమ్మెల్యేలు కూడా ఉండ‌ట‌మే ఇప్పుడు బాబును ఇబ్బందిపెడుతున్న అంశ‌మ‌ట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.