కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ..?

తెలుగురాష్ట్రాల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారుతున్నాయి. ఏపీలో ప‌రిస్థితి అనుకూలంగా లేక‌పోవ‌డంతో తెలంగాణ‌లో ఎలాగైన ప‌ట్టుసాధించి అధికార పీఠం చేజిక్కించుకోవాల‌ని టి కాంగ్రెస్ క‌ల‌లు కంటుంది. ఈ మేర‌కు సీనియ‌ర్లు కూడా తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రో ఐదుసంవ‌త్స‌రాలు అధికారానికి దూరంగా ఉంటే కాంగ్రెస్ నుంచి ఉన్న నాయ‌కులు కూడా వ‌ల‌స వెళ్లిపోతార‌నే భ‌యం సీనియ‌ర్ల‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి మార్గాన్ని అన్వేషిస్తున్నారు. అయితే సీనియ‌ర్లు కొంత మంది టీడీపీకి ద‌గ్గ‌రయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. టీడీపీతో క‌లిసి పోటీ చేస్తే గ్రేట‌ర్‌లో అన్నిసీట్ల‌తో పాటు వివిధ జిల్లాలో గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. టి కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీ విషయంలో త‌మ దృక్ప‌థాన్ని మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌లె క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు వీహెచ్ హ‌నుమంత‌రావు మాట్లాడుతూ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత బీజేపీ ఏపీ పై దాడిచేసేందుకు ప్ర‌య‌త్నాలు చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. చంద్ర‌బాబు వీటిని ఎలా తిప్పి కొడ‌తారో వేచి చూడాలి అంటూ వ్యాఖ్యానించారు. బాబుపై ఎప్పుడు విరుచుకుప‌డే వీహెచ్ అనుకూలంగా మాట్లాడటంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ.. కాంగ్రెస్ మ‌ధ్య దోస్తీ కుదిరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్న కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు త‌ప్పితే టీడీపీ ఉద్దేశించి ఎక్క‌డ మాట్లాడ‌టం లేదు. మ‌రి కాంగ్రెస్ నాయ‌కుల ఆశ‌ల‌ను టీడీపీ నెర‌వేరుస్తుందా లేదా అనేది కాల‌మే నిర్ణ‌యిస్తుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.