రివెంజ్ తీర్చుకున్న చంద్ర‌బాబు !

గాలి జ‌నార్దన్‌రెడ్డి… హంస తూలికా త‌ల్పంపై రాజ‌భోగాలు అనుభ‌వించి బ‌ళ్లారి న‌గ‌రాన్ని, ఆ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న ఇంటిగా మార్చ‌కుని తాను ఆధునిక విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యానికి అధిప‌తిని, శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయుల‌కు తాజా రూపాన్ని అంటూ విర్ర‌వీగిన గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి వైఎస్ సీఎంగా ఉన్న‌పుడు చంద్ర‌బాబును అత్యంత దారుణ‌ప‌దాల‌తో దూషించారు. బ‌హుశా అలాంటి తిట్లు చంద్ర‌బాబును ఎవ‌రూ తిట్ట‌లేదు. కానీ అలాంటి తిట్ల‌కు కూడా చంద్ర‌బాబు సంయ‌మ‌నంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారే గాని గాలి స్థాయికి దిగ‌జారి తిట్ట‌లేదు.
సీన్ క‌ట్ చేస్తే… గాలి … జైలుకెళ్లాడు. మారాడు. రిగ్రెట్ అయ్యాడు. కానీ అక్క‌డితో అయిపోలేదు. ప‌త‌నం కొన‌సాగుతూనే ఉంది. 2004 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ చేజారిన బ‌ళ్లారి మెల్ల‌గా గాలి సోద‌రుల చేతిలోకి వెళ్లింది. ఇక ఆ త‌ర్వాత అన్ని ఎన్నిక‌లు వాళ్లే గెలిచారు. 1951 నుంచి 2000 ఏడాది వ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా కాంగ్రెస్ అక్క‌డ గెలుస్తూనే వ‌స్తోంది. అది కాంగ్రెస్‌కు చెక్కు చెద‌ర‌ని నియోజ‌క‌వ‌ర్గం. చివ‌ర‌కు రాయ్‌బ‌రేలీ, అమేథీ వ‌దిలి సోనియాగాంధీ కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చి పోటీ చేసిందంటే… ఇక అక్క‌డ కాంగ్రెస్ ఎంత స్ట్రాంగో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే, 2014లో దేశంలో అంద‌రి వ‌ద్ద‌కు వెళ్లి మాయ‌మాట‌లు చెప్పి మీరే నాకు దేవుడు అని అంద‌రినీ పొగిడి పెద్ద కూట‌మి ఏర్పాటుచేసుకున్నాడు న‌రేంద్ర‌మోడీ. కానీ అత‌ను పాల‌న‌లో అస‌మ‌ర్థుడు మాత్ర‌మే కాదు… ఇగో కోసం ప్ర‌జాస్వామ్యాన్ని చంపేయ‌గ‌ల మూర్ఖత్వం పుణికి పుచ్చుకున్న వ్య‌క్తి అన్న‌ది అంద‌రికీ అర్థ‌మయ్యింది. సాక్షాత్తూ ఆ వెంక‌టేశ్వ‌ర స్వామి పాదాల కింద నిల‌బ‌డి మాట్లాడుతూ ఢిల్లీని మించిన రాజ‌ధాని క‌ట్టిస్తాం అని చెప్పి, ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడిన మోడీ అత్యంత దారుణంగా తెలుగు ప్ర‌జ‌ల‌ను మోసం చేశాడు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వ‌డంలో కేవ‌లం రాజ‌కీయం చేస్తే… బీజేపీ చేసింది ప‌చ్చి మోసం, ద‌గా. ఒక విగ్ర‌హానికి పెట్టిన ఖ‌ర్చంత సొమ్ము కూడా చివ‌ర‌కు అమరావ‌తికి ఇవ్వ‌ని మోడీ తీరుతో విసుగెత్తిన చంద్ర‌బాబు ఆ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు.
ఆరోజు ఇదే అవ‌మానంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టి కేంద్రంలో కీల‌కంగా మారాడు. ఈరోజు అదే తెలుగుదేశం ఆధ్వ‌ర్యంలో చంద్ర‌బాబు కేంద్రంలో మ‌హాకూట‌మి ఏర్పాటుచేసి మ‌ళ్లీ కేంద్రంలో కీల‌కంగా మారుతున్నారు. మ‌నం ఢిల్లీని అడ‌గ‌డం కాద‌ని… తెలుగువారే ఢిల్లీని శాసిస్తే ప్ర‌త్యేక హోదా అనేది మ‌న చేతిలో ప‌ని అని చంద్ర‌బాబు డిసైడై దేశంలోని ప్ర‌ముఖ పార్టీల‌న్నింటినీ ఒకే కూట‌మిగా చేశాడు. అంద‌రి శ‌త్రుత్వాల‌ను పంచాయ‌తీ చేసి వారంలో అంద‌రినీ ఏకం చేశాడు. అయితే, త‌న శ‌క్తేంటో అప్ప‌టికే క‌ర్ణాట‌క రాజ‌కీయంలో చూపించిన చంద్ర‌బాబు వ్యూహాల‌కు అన్ని పార్టీలు స‌లాం కొట్టాయి.
స‌రిగ్గా వారం కింద‌ట బ‌ళ్లారి ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మాట్లాడుతూ చంద్ర‌బాబు స‌మ‌ర్థుడ‌ని, ఆయ‌న కూట‌మి ఏర్పాటుచేయ‌డం దేశానికి శుభ సూచ‌కం అని అన్నారు. బ‌ళ్లారి నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగు వారు అత్య‌ధికంగా ఉంటారు. వారు దేవెగౌడ మాట‌ల‌కు తీవ్రంగా ప్ర‌భావితం అయ్యారు. చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌డితే బీజేపీని ఏపీ రాష్ట్రానికి నిధులివ్వ‌మ‌ని అడుక్కోవాల్సిన ప‌నిలేద‌ని, ఇక కావాల్సిన నిధులు తెచ్చుకోవ‌చ్చ‌ని భావించారు. అది చంద్ర‌బాబు ప్ర‌జ‌ల్లో కేవ‌లం వారం అంటే వారం రోజుల్లో ఏర్పాటుచేసిన న‌మ్మ‌కం. అంతే ఒక్క దెబ్బ‌కు గాలి బ్ర‌ద‌ర్స్ కోట‌లు భూస్థాపితం అయ్యాయి. మ‌ళ్లీ చంద్ర‌బాబు బ‌ల‌ప‌రిచిన‌ కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి అభ్య‌ర్థి ఉగ్ర‌ప్ప భారీ మెజారిటీతో బ‌ళ్లారి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. చంద్ర‌బాబు రేంజ్ ఏంటో ఇపుడు గాలి బ్ర‌ద‌ర్స్‌కు చాలా స్ప‌ష్టంగా అర్థ‌మై ఉంటుంది. ఏకంగా రాష్ట్రంలో అధికారం వెల‌గ‌బెడ‌దామ‌ని ఆశించిన గాలి సోద‌రుల‌కు చివ‌ర‌కు సొంత ఊరు కూడా ద‌క్క‌కుండా పావులు క‌దిపారు చంద్ర‌బాబు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.