తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. దళితుల పై దారుణాలు జరుగుతున్నా సిఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మీరు కేసీఆర్ కు మద్దతు పలకడం ఏం బాగోలేదని చెప్పారు. అంతే గవర్నర్ కు కోపం వచ్చింది. మీ రాజకీయాలతో నాకు సంబంధం లేదని వాదించారు. ఫలితంగా కాంగ్రెస్ నేతలు మరింత గట్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మీరు గవర్నర్లా వ్యవహరించడంలేదు. టీఆర్ఎస్ నేతలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తప్పు పట్టారు. మరోవైపు మల్లు రవి ఆయనకు వంత పాడారు. వారన్న మాటలకు గవర్నర్ అభ్యంతరం చెప్పారు.
కొత్త ఏడాదిలో మీరు ప్రభుత్వానికి సహకరించాలి ఇలా ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. దళితులను పట్టుకుని మర్మాంగాల్లో కర్రలు పెడుతున్నా..చూస్తు ఊరుకోవడం ఎంత వరకు కరెక్టు. అది మీకు తప్పుగా కనిపించడం లేదా అని గట్టిగా మాట్లాడారు. వారి మాటలకు గవర్నర్ తొలిగా కంగారు పడ్డారు. ఆ తర్వాత మాటలతోనే ఎదురుదాడి చేశారు.
నరసింహన్ ను తీసుకువచ్చి పెట్టిందే కాంగ్రెస్ నేతలు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అదే పార్టీకి ఏకుమీద మేకు అయ్యాడంటున్నారు. పదవిలో లేకపోతే అంతే మరి అంటున్నారు మిగతా నేతలు. రేపు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారికి అనుకూలంగా గవర్నర్ మాట్లాడతారనే చర్చ సాగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ను తీసేయాలని పెద్ద ఎత్తున టీడీపీ, టీఆర్ఎస్ లు ఆందోళనలు చేశాయి. అయినా సరే కాంగ్రెస్ పార్టీలోని సర్వే సత్యనారాయణతో పాటు..మల్లు రవి తదితరులు వారి మాటల దాడిని ఖండించారు. గవర్నర్ ను వెనకేసుకు వచ్చారు. కానీ ఇప్పుడు అదే గవర్నర్ చేసిన సాయం మర్చిపోయి తమను పురుగుల్లా చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు చూసింది. బడ్జెట్లో కేటాయింపులు లేవు. అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని అరుణ్ జైట్లీ ప్రస్తావించలేదు. తెలంగాణ ప్రాజెక్టులపైనా స్పందించలేదు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను అసలు ప్రధాని మోడీ పట్టించుకోలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. […]
తెలంగాణలో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. తమ ఆగడాలకు అడ్డు వచ్చే వారిని చంపేస్తోంది. గవర్నర్ నరసింహన్ ను కలిసిన టీ కాంగ్రెస్ నేతలు అదే విషయాన్ని ప్రస్తావించారు. సి.ఎం కేసీఆర్ కు చేతగావడం లేదు. మీరైనా చెప్పాలని కోరారు. అయినా సరే […]
తెలంగాణ సిఎం కేసీఆర్ ఎవరినీ లెక్కచేయరంటారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి అపాయింట్ మెంట్ ఇవ్వరు. తనను విమర్శించే వారిపై రాజకీయ కక్ష్య తీర్చుకుంటారంటారు. ఆ ప్రయత్నంలో కోర్టు ధిక్కారానికి ఆయన పాల్పడుతున్నారని తెలుస్తోంది. తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొడవ చేశారు. […]
Be the first to comment