నీకొక‌టి నాకొక‌టి… ప‌ద‌వుల పంప‌కం…

క‌ర్ణాట‌క రాజ‌కీయ సంక్షోభానికి తెర ప‌డింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద‌పార్టీ అవిర్భ‌వించిన బీజేపీ మ్యాజిక్ ఫిగ‌ర్ చేరుకోలేక‌పోయిది. ఈ త‌రువాత చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మిఅధికారం చేప‌ట్టింది. జేడీఎస్ అధ్య‌క్షుడుకుమార‌స్వామి సీఎం ప‌ద‌వి చేప‌ట్టాడు కాని ప‌ద‌వుల పంపిణీ ఇరుపార్టీల‌కు త‌ల‌నొప్పిగా మారింది. చివ‌ర‌కు కేటాయింపు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. కీల‌క శాఖ‌ల నిర్ణ‌యం పూర్త‌యింది.

ఆర్థిక శాఖను జేడీఎస్‌, హోం శాఖను కాంగ్రెస్ పంచుకున్నట్లు సమాచారం. ఈ రెండూ కీలక శాఖలు కావడంతో వీటిపై ఇన్నాళ్లూ కొనసాగిన తర్జనభర్జనకు ఫుల్‌స్టాప్ పడినట్టయింది. మిగిలిన శాఖల విషయంలో ఇరు పార్టీలు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. కాగా, ముందుగా అనుకున్నట్టుగానే… కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. త్వరలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. మొత్తానికి కాంగ్రెస్‌-జేడీఎస్ మ‌ధ్య నెల‌కొన్న వివాదం స‌ద్దుమ‌ణిగిన‌ట్టే అని తెలియ‌డంతోక‌న్న‌డ ప్ర‌జ‌లు ఊపీరిపీల్చుకుంటున్నారు. కాని ఏ స‌మ‌యానికి ఏం జ‌రుగునో ఎవ‌రూ ఊహించేద‌రు…అన్న‌ది క‌ర్ణాట‌క రుజువు అయినా ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.