బీజేపీని ఓడించేందుకు ఏకమైన కాంగ్రెస్, జేడీఎస్‌

బలం లేని చోట అధికులమనే ఆలోచన చేయలేదు జేడీ(ఎస్). అందుకే పద్దతిగా కర్నాటకలోని జయనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ముందే తప్పుకుంది. కాంగ్రెస్ కు మద్దతు పలికింది. కాంగ్రెస్, జేడీఎస్ తో పాటు..ఎస్పీ, బిఎస్పీ,కామ్రేడ్స్ ఇప్పుడు ఒక కూటమిగా ఏర్పడగా…బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తోంది. ఇక్కడ జేడీఎస్ అభ్యర్థిగా కాలెగౌడ పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తో కుదిరిన ఒప్పందం మేరకు తమ నేతను ఉపసంహరించుకుని కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యరెడ్డికి మద్దతు ప్రకటించింది. మే4న బీజేపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్ గుండెపోటుతో మరణించడంతో జయనగర్ ఎన్నికను రద్దు చేశారు. ఈనెల 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. విజయ్‌కుమార్ సోదరుడు బీఎన్ ప్రహ్లాద్‌ను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ఇక్కడ నిలబెట్టడంతో ఉత్కంఠ నెలకుంది. రాజరాజేశ్వరి నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ సారి అదే పరిస్థితి వస్తుందని హస్తం నేతలు చెబుతుండగా..కాదు కాదు తామ సత్తా చాటుతామని చెబుతున్నారు కమలం నాయకులు.

కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి వెళ్లి జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. జేడీఎస్ సొంత అభ్యర్థిని నిలపకుండా తన కుమార్తె సౌమ్యకు మద్దతివ్వాల్సిందిగా రామలింగారెడ్డి కోరాడంతో ఆయన మెత్తబడ్డారు. అంతే కాదు..బీజేపీని ఓడించడానికి ఇంత కంటే మంచి అవకాశం రాదని ఆలోచించాడు దేవెగౌడ్. అంతే జయనగర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జై కొట్టారు. అంతే ఆ రెండు పార్టీలు ఏకమై బీజేపీని ఓడించడానికి సిద్దమయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.