కుమార‌స్వామి కుర్చీకు గండ‌మా!

క‌ర్ణాట‌క రాజకీయం ర‌స‌కందాయానికి చేరిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  చ‌చ్చీచెడి.. తలా మాట సాయం.. బీజేపీపై వ్య‌తిరేక‌త పుణ్య‌మాంటూ.. జేడీఎస్ నేత కుమార‌స్వామి సీఎం కుర్చీపై కూర్చున్నారు. కాంగ్రెస్ వాళ్ల‌కు బ‌లం ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో స‌మీక‌ర‌ణల దృష్ట్యా సీఎం ప‌ద‌విని హ‌స్తం త్యాగం చేసింద‌నే చెప్పాలి. అయితే.. ఈ విష‌యంలో బీజేపీ ప‌రవు పోగొట్టుకుని.. తిరిగి పుంజ‌కునేందుకు ఉన్న దారుల‌న్నీ వెతుకుతుంది. క‌ర్ణాట‌క‌లో కోట్లు కుమ్మ‌రించినా.. హ‌స్తం పార్టీ ఎమ్మెల్యేల ఐకమ‌త్యం.. గాలి జనార్ద‌న్‌రెడ్డి వంటి నేత‌ల  కుతంత్రాల‌నూ నెగ్గుకురాగ‌లిగింది. కానీ.. ఆ వ‌ర్గంతో కుమార‌స్వామికి వున్న అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డ‌తున్నాయి. పైగా.. శివ‌కుమార్‌కు కేబినెట్‌లో మంచి స్థానం ఇచ్చేందుకు దేవెగౌడ్ అస్స‌లు అంగీక‌రించ‌క‌పోవ‌టంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు కాస్త ఇబ్బందిగా మారింద‌ట‌. పోన్లే.. అదిష్ఠానం ఆదేశాలంట స‌ర్దుకుపోదామంటే.. అభిమానులు, కార్య‌క‌ర్త‌లు మాత్రం..ఇది ప‌రువు ప్ర‌తిష్ఠ‌లు సంబంధించిన అంశంగా నేత‌ల‌పై ఒత్తిడి పెంచార‌ట‌. వ‌చ్చిన అవ‌కాశాన్ని గాలి బ్ర‌ద‌ర్స్ చూస్తూ ఊరుకుంటారా… దీంతో అసంతృప్త ఎమ్మెల్యేల జాబితాను త‌యారుచేసి.. ఆ  12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో  కుమార‌స్వామి సీటుకు ఎస‌రుపెట్టే ప‌నిలో ఉన్నార‌ట‌.

 

దీనిపై బేర‌సారాలు బాగానే సాగుతున్నాయ‌ట‌. చివ‌ర‌కు శివ‌కుమార్ రంగంలోకి దిగి  12 మంది ఎమ్మెల్యేల‌కు న‌చ్చ‌జెప్పేందుఆట‌  మా గొప్పే.. మోదీకు బుద్ధి చెప్పేందుకు… అంట‌.. తెలుగు సీఎంలిద్ద‌రూ మాంచి బిల్డ‌ప్ ఇచ్చారు. పైగా.. ఈ మ‌ధ్య‌నే కుమార‌స్వామి కూడా చంద్ర‌బాబు, చంద్ర‌శేఖ‌ర్‌లు నాకు వెన్నుద‌న్నుగా ఉన్నారంటూ బ‌య‌ట‌ప‌డ్డారు.  మ‌రి ఈ లెక్క‌న‌. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ జ‌లానీ అయితే.. ముగ్గురు ప‌రువు.. గంగ‌లో క‌ల‌సిపోతుంద‌నే భ‌యం కూడా నేత‌ల‌ను వెంటాడుతుంద‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.