కాంగ్రెస్ నెత్తిన చంద్ర‌న్న‌పాలు!

హ‌మ్మ‌య్య‌.. ఆశించినట్టు  అవ‌కాశం చేరువైంది. ఇక దాదాపు స‌మ ఉజ్జీలుగా పోటీలో త‌ల‌ప‌డ‌వ‌చ్చు. ఇది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో సంబ‌రం. అయితే.. దీనివెనుక కొన్ని చిక్కుముడులున్నా.. పెద్ద ఇబ్బందేం కాదంటున్నారు. అదెలా అంటారా! హ‌స్తంతో చెలిమి.. ఎందుకంటే.. ఇక్క‌డ పొత్తు అంటే హ‌స్తం వ‌ర్సెస్ టీడీపీ అనే అంశంపై ప్ర‌జ‌ల్లో వేరే అభిప్రాయం ఏర్ప‌డ‌వచ్చు. అందుకే.. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ .. మ‌రో పార్టీ ఇలా.. నాలుగైదు పార్టీల కూట‌మితో కేసీఆర్‌పై త‌ల‌ప‌డేందుకు చంద్ర‌ద‌ళం సిద్ధ‌మైన‌ట్లు సంకేతాలు వ‌స్తున్నాయి. దీని ప్ర‌భావం ఏపీలో ఎలా ఉంటుంద‌నేది త‌రువాత ప‌రిణామాల ఆధారంగా నిర్ణ‌యించుకుంటార‌నే అభిప్రాయం కూడా ఉంది. 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా కేసీఆర్‌పై ప్ర‌తికారం తీర్చుకోవాల‌నే ల‌క్ష్యంతో కాంగ్రెస్ పావులు క‌దుపుతుంది. దానికి త‌గిన‌ట్లుగానే మొద‌టి నుంచి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగ‌మే టీడీపీతో క‌ల‌యిక‌. చంద్ర‌బాబుతో స‌మావేశ‌మైన టీడీపీ శ్రేణులు.. హ‌స్తంతో దోస్తీకు ఓకే అన్నారు. పైగా.. గులాబీనేత‌లు త‌ల‌ప‌డుతున్న 25 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటుబ్యాంకు చెక్కుచెద‌ర‌లేద‌నే ధీమా వ్య‌క్తం చేశార‌ట‌. ఇదే నిజ‌మైతే.. హ‌స్తం క‌నీసం 40 చోట్ల బ‌లం పుంజుకుంటుంది. ఈ లెక్క‌న‌.. 60-70 సీట్లు ఇరు పార్టీల క‌ల‌యిక‌తో సాధింవ‌చ్చ‌నే అంచ‌నాల‌కు వచ్చారు.
పైగా అంత‌ర్గ‌తంగా స‌పోర్టు ఇచ్చేందుకు కోదండ‌రాం, గ‌ద్ద‌ర్ వంటి నేత‌లు ఉండ‌నే ఉన్నారు. కేసీఆర్ భావించిన‌ట్టుగా ప్ర‌జ‌ల్లో ప్ర‌జా అనుకూల‌త లేద‌నేది విప‌క్షాల వాద‌న‌. పైగా గులాబీబాస్‌.. ప్ర‌జ‌ల చెవిలో.. త‌న‌ను న‌మ్మిన తెలంగాణ ఉద్య‌మ‌కారుల చెవుల్లోనూ గులాబీపూలు పెట్టారంటూ ఎద్దేవాచేస్తున్నారు. ఇంత‌టి వ్య‌తిరేక‌త ఉన్నా.. కాంగ్రెస్ గెలుపుపై సందిగ్ద‌త ఉండేది. దానికి కార‌ణం స‌రైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌టం.. బ‌ల‌హీనంగా మార‌టం. అయితే.. అది టీడీపీతో కూట‌మిగా మార‌టంతో దాదాపు అధిగ‌మించిన‌ట్టే అనే ఆత్మ‌విశ్వాసం పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిలో ఉంది. సో.. ఈ లెక్క‌న‌.. బాబు మ‌దిలో ఏముందో అనుకుంటూ కాస్త భ‌య‌ప‌డిన హ‌స్తం నేత‌లు.. త‌మ హ‌స్త‌వాసి బాగానే ఉంద‌నుకుంటున్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల సంగ‌తి ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం త‌మ‌వైపు బాబు రావ‌టం.. మ‌ద్ద‌తు ఇవ్వ‌టం.. నెత్తిన పాలు పోసినంత సంబ‌రంగా ఉందంటున్నార‌ట హ‌స్తం నేత‌లు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.