ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ కన్నెర్ర

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులకు 24 గంటల విద్యుత్ ను ప్రకటించారు. దీనికి కాంగ్రెస్, బిజెపిలు మండిపడుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అయితే అసలు కేసీఆర్ వల్ల ఏం కాదనితేల్చి చెప్పాడు. టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క యూనిట్‌ విద్యుదుత్పత్తి జరగలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన విద్యుత్‌ ప్రాజెక్టులు నేడు పూర్తి అయ్యాయి. ఫలితంగా సాగుకు నిరంతర విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లో 1,200 మెగావాట్లు, భూపాలపల్లిలో 600 మెగావాట్లు, పులిచింతల ప్రాజెక్ట్‌ వద్ద 90 మెగావాట్ల ప్రాజెక్ట్‌లతోపాటు జూరాల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్‌ హయాంలోనే ప్రారంభించాడు. హస్తంపార్టీ కాలంలోనే 80 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయి. నేడు వాటికి టీఆర్‌ఎస్‌ ప్రారంభోత్సవాలు చేస్తోంది. అది తమ గొప్పతనంగా చెప్పుకుంటుంది. 
          చంద్రబాబు కాలంలో హెటెక్ సిటీ, వైఎస్ కాలంలో ఔటర్ రింగ్ రోడ్డులు వచ్చాయి. కానీ అదంతా తన ఘనతేనని టీఆర్ఎస్ చెప్పుకుంటోంది. మెట్రోరైలు ప్రాజెక్టు వైఎస్ కాలంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అసలు కేసీఆర్ రైతు కాదని చెప్పాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు. 24 గంటలూ కరెంట్ ఇవ్వడం వల్ల భూగర్భ జలాలు తోడుతారని చెప్పారు. ఫలితంగా అవి అడుగంటి పోతాయని..కరవు వస్తుందని కొత్త మాట చెప్పారాయన. కేంద్రం మిగులు విద్యుత్ ఇవ్వడం వల్లనే కేసీఆర్ సర్కార్ సంతోషంగా ఉందంటున్నారు బీజేపీ నేతలు. దేశంలోని 16 రాష్ట్రాల్లో ఇప్పుడు విద్యుత్ కోతల్లేవు. అదే సమయంలో విద్యుత్ ను బాగానే ఉత్పత్తి చేస్తున్నారు. అంతే తప్ప కేసీఆర్ ఘనత కానే కాదంటున్నాడు కోదండరామ్ వంటి నేతలు. 
            కేసీఆర్ సర్కార్ 24 గంటలూ విద్యుత్ ఇస్తున్న వైనం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ వంటి నేతలు కేసీఆర్ తీరును మెచ్చుకున్నారు. ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం దీని పై ఆరా తీస్తోంది.  ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు ఇంత కంటే మంచి అవకాశం రాదని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అందుకే రైతుల కోసం తాను ఎంతో కష్టపడుతున్నట్లు చెప్పారు. అంతే కాదు…ఈ ఏడాది నుంచి రూ.4 వేలు పెట్టుబడి రుణాన్ని కేసీఆర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.