కాంగ్రెస్ కూడా మొదలుపెట్టేసింది

ఏపీలో జీవం కోల్పోయినా.. తెలంగాణలో కొంచెం ఫామ్‌లోకొచ్చినట్లు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. గత ఎన్నికల్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు షాకిచ్చారు. అందుకే ఈ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తానని మాటిచ్చిన కేసీఆర్.. విలీనం కాదు కదా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఆ పార్టీలోని కీలక నేతలకు వల వేసిన కేసీఆర్.. చాలా మందిని గులాబీ గూటికి చేర్చుకున్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడింది. వాస్తవానికి ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో బాగా బలపడినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఇప్పుడు ఆ పార్టీ నేతలు బాగా యాక్టివ్‌గా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలనుకున్న ఆ పార్టీ.. టీడీపీలో కేసీఆర్ వ్యతిరేకులైన రేవంత్ రెడ్డి వర్గంలోని కొందరు ముఖ్య నేతలను వారి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వచ్చిన తర్వాత టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి బాగా పెరిగిపోవడంతో, టీఆర్ఎస్ కూడా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ మరో వాదనను తీసుకొచ్చింది. ఏపీలో హాట్ హాట్‌గా సాగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కాంగ్రెస్ తన భుజాలకు ఎత్తుకుంది. తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే జాతీయ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించినప్పటి నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు దీనిని సమర్ధిస్తున్నారు. ఏపీలో విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణలో ఇలా చేయడం వల్ల టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీని తెలుగుదేశం పార్టీ వలే కాంగ్రెస్ కూడా సెటిలర్ల పార్టీ అనే ముద్ర వేస్తున్నారు. ఇది ఆ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉన్నందువల్ల కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై రాష్ట్రంలో సర్వే నిర్వహించబోతుందట. ‘‘కాంగ్రెస్ పార్టీని సెటిలర్ల పార్టీ అని మీరు భావిస్తున్నారా..? ఏపీకి హోదా కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడాన్ని మీరు సమర్ధిస్తారా..?, వచ్చే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు..?’’ వంటి ప్రశ్నలను ఆ పార్టీ తయారు చేసే ప్రయత్నాలు జరుపుతుందని తెలుస్తోంది. ఏది ఏమైన వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ బాగా కష్టపడుతోందని పలువురు అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.