కేసీఆర్ తో కలిసేది లేదన్న కామ్రేడ్స్

తెలంగాణలో కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని 2014లో అనుకుంది సిపిఐ. కానీ కేసీఆర్ ఆ పార్టీని లెక్కలోకి తీసుకోలేదు. అయినా సరే సిపిఐ తన ఉనికిని కాపాడుకుంటూ దేవరకొండలో గెలిచింది. లేకపోతే ఆపార్టీకి అసలు సీటే లేకుండా పోయేది. ఇక సిపిఎం భద్రాచలంలో గెలిచింది. రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మిగతా చోట్ల ఆ పార్టీ నేతలకు ఓట్లు పడ్డా.. అంత ప్రభావం చూపించ లేకపోయారు. ఇక ఏపీలో ఆ రెండు పార్టీలను జనాలు పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఏపీలో కాంగ్రెస్ కు అదే గతి పట్టింది.  
సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి సుర‌వ‌రం సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. గతంలో కేసీఆర్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించిన ఆయనే ఇప్పుడు గులాబీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. భవిష్యత్ లోను కేసీఆర్ పార్టీతో కలిసి వెళ్లేందుకు కంకి కొడవలి గుర్తు సిద్దంగా లేదు. ఇటీవల సిపిఐ నారాయణ ఇదే మాట చెప్పాడు. జనసేనతోను కలిసి పోయేందుకు సిద్దంగా లేమనే సంకేతాలిచ్చారు. ఏపీలో జగన్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఏది లేదని తేల్చింది సిపిఐ. ఒకవేళ తాము పొత్తు పెట్టుకుంటే జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని సిపిఐ నారాయణ అంటున్నారు.
టీఆర్ఎస్, బీజేపీ, జనసేన, వైకాపా పార్టీలతో కలిసి ముందుకు సాగేది లేదని చెప్పారు సిపిఐ నేతలు. కేసీఆర్ వల్ల తెలంగాణకు ఎలాంటి మేలు జరగలేదనేది కామ్రేడ్స్ మాటగా ఉంది. ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అభివృద్ధి ఇంకా వెనకకు వెళ్లిందని సిపిఐ వాదిస్తోంది. దాదాపు సిపిఎం కేసీఆర్ తో కలిసి సాగేందుకు సముఖంగా లేదు. మొత్తంగా కామ్రేడ్స్ గులాబీకి ముల్లు గుచ్చేందుకే సిద్దం కావడం ఆసక్తికరమే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.