ప్రజారాజ్యం’ను గుర్తు చేసుకుంటున్న కామ్రేడ్స్

పవన్‌తో జతకట్టాలనుకుంటున్న వామపక్షాలు ఇప్పుడు చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ను గుర్తుచేసుకుని, పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీతో ప్రజల మధ్యకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవిపై తెలుగు ప్రజల్లో మంచి అభిప్రాయం లేదని,  ఆ ఎన్నికల్లో చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ తన అన్నయ్య తరఫున తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ప్రచారం కూడా చేశారని వారు గుర్తుచేసుకుంటున్నారు. అయితే ఆ ఎన్నికలు, అనంతర పరిణామాలతో చిరంజీవి, ఆయన కుటుంబంపై తెలుగు వారిలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనే విషయాన్ని వామపక్షాల అగ్ర నాయకులు గుర్తు చేసుకోవాలని ఆ పార్టీలకు చెందిన మేథావులు సూచిస్తున్నారట. దీంతోవారు సినిమా వారిని నమ్ముకుని ఎన్నికలకు వెళ్తే పార్టీకి ఉన్న మంచి పేరు ప్రజల్లో పోతుందని కూడా హెచ్చరిస్తున్నారట. “వామపక్షాలకు ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకునే శక్తి ఎలాగూలేదు. అయితే ప్రజల్లో ఈ పార్టీలపై ఇంకా నమ్మకం ఉంది” అని సిపిఎంకు చెందిన సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అటువంటి పరువు, పేరును ఇప్పుడు పవన్ కల్యాణ్ కోసం వదులుకోవడం ఏమంత శ్రేయస్కరం కాదన్నది క్షేత్ర స్ధాయి నాయకులు, కార్యకర్తలు, మేథావుల అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. ఏతావాతా చూస్తే జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
గడచిన నాలుగైదు నెలలుగా వామపక్షాలకు చెందిన నాయకులు జనసేనాని పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నవిషయం విదితమే. అలాగే జనసేనతో కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. సిపీఎం ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నప్పటికీ సిపీఐ మాత్రం లోలోపల జనసేనకు మద్దతు తెలుపుతున్నా బయటకు మాత్రం కొన్నాళ్లు వేచి చూడాలనే ధోరణిలోనే ఉందట. సీపీఎం, సీపీఐలకు చెందిన అగ్ర నాయకుల జనసేనతో కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఆ పార్టీలకు చెందిన కిందిస్ధాయి నాయకులు, కార్యకర్తలు, మేథావులు పవన్ కల్యాణ్ తో పొత్తుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బలం కేవలం ఆయన అభిమానులే అని, వారిలో సగానికి పైగా ఓటర్ల కాదని కార్యకర్తలు అనుకుంటున్నారట. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తుపై తగిన నిర్ణయం తీసుకోవాలని వారు తమ నేతలకు సూచిస్తున్నాట. ఇప్పుడు పవన్ మనతో కలిసినా, ఎన్నికల అనంతరం ఆయన బీజేపీతో జతకడితే ఇన్నాళ్లూ వామపక్షాలకు ఉన్న పేరు పోతుందని వారు మదనపడుతున్నారట. మరి ఇప్పుడు వీరిపొత్తు ఎటువైపు దారితీస్తుందో చూడాలిమరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.