బాబుపై వారి తిట్ల దాడి ఎందుకంటే?

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి వెళుతున్న టీఆర్ఎస్ అగ్రనేతలు వీలున్నప్పుడల్లా ఏపీ సీఎంపై తిట్ల వర్షం కురిపిస్తున్న విషయం విదితమే. ఇలా చేయడంవలన సెటిలర్ల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ వారు తమ వైఖరి ఎందుకు మార్చుకోవడంలేదనేది పెద్ద ప్రశ్నగా మారింది. ‘తెలంగాణలో అడుగు పెడితే మా వద్దనున్న రికార్డులు బయటపెట్టి బాబు బండారం బయటపెడతాం’ అని హరీష్ రావు చంద్రబాబును హెచ్చరించడంతో పాటు ప్రజలు కేసీఆర్‌ను నమ్ముతారా? లేక నక్క జిత్తుల చంద్రబాబును నమ్ముతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు గుంట నక్క అంటూ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు ఇదే అదనుగా బాబుపై లెక్కలేనన్ని విమర్శలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ నేతల టార్గెట్ చంద్రబాబునాయుడు అనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మొదలుకొని, కింది స్థాయి నేతల వరకూ అందరూ బాబుపై తిట్లు లంకించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా సీఎం కేసీఆర్… చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న విషయం విదితమే. ఫలితంగా తెలంగాణలోని సెటిలర్లతోపాటు ఇతరుల్లో కూడా వ్యతిరేకత వస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయినా టీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడం విశేషం.

మరోవైపు అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అర శాతం, ఒక్క శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని, ఆ పార్టీని అసలు పరిగణించాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యానించిన విషయం విదితమే. అలాగే ప్రస్తుతం టీఆర్ఎస్ తమ ప్రత్యర్థి చంద్రబాబునాయుడే అన్నంతగా వ్యవహరిస్తోందన్నవ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం మహాకూటమి ఏర్పడిన తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ కారణంగానే అసహనంతోనే టీఆర్ఎస్ నేతలు విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా బాబు రాజకీయ వ్యూహాలన్నీ ఢిల్లీని గురి చూసినట్లున్నాఅవి తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనున్నాయన్న అంచనాలున్నాయి. అలాగే చంద్రబాబు తెలంగాణలో పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారని, దాన్ని తిప్పికొట్టేందుకే టీఆర్ఎస్ నేతలు అలా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమిలో ఉన్న చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకూటమి విజయానికే ప్రయత్నిస్తారనేది తెలిసిందే. అందుకే అసహనంతో టీఆర్ఎస్ నేతలు అలా ప్రవర్తిస్తున్నారని భోగట్టా. ఏదిఏమైనా చంద్రబాబును తిడితే అది టీఆర్ఎస్ కే నష్టమని, తద్వారా చంద్రబాబుకు సానుభూతి లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

1 Comment

  1. ఎవరు గుంట నక్కలో తెలంగాణా జనం గ్రహించేశారు. మాటలతో మోసం చేసే టీఆర్ఎస్ నాయకులు ఎన్ని వేషాలు వేసినా జనం నమ్మే పరిస్థితి లేదు.బంగారు తెలంగాణ అంటూ నాలుగున్నర ఏళ్లుగా మోసం చేస్తూ ఇచ్చిన హామీలు విస్మరించి తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు బొంద పెడతారు.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.