సిపిఎంలో కోల్డ్ వార్

సిపిఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, ఇప్పటి కార్యదర్శి సీతారామ్ ఏచూరి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. మరోసారి ప్రధాన కార్యదర్శిగా ఉండేందుకు ఏచూరి సిద్దమవుతున్నారు. కానీ అతని స్థానంలో బృందాకారత్ లేక మరో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ను తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఫలితంగా రెండు వర్గాలుగా సిపిఎం చీలింది. ఒకటి ఏచూరి వర్గంగా.. రెండోది ఆయన వైరి వర్గం. పార్టీ పరంగా బయటకు ఒకటే. కానీ కార్యవర్గం, కార్యదర్శిని ఎన్నుకునే విషయంలో రెండుగా చీలింది. ఫలితంగా కొత్త కార్యదర్శి వస్తారా లేదా ఆయన్నే కొనసాగిస్తారనే ఉత్కంఠ నెలకుంది.    
సిపిఎం 22వ జాతీయ మహాసభలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు సిపిఐ, సిపిఐ ఎంల్ తో పాటు.. వివిధ దేశాల్లో ఉన్న కమ్యూనిస్టు నేతలను ఆహ్వానించారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ ఎంఎల్‌ నేత దీపాంకర్‌ భట్టాచార్య, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, ప్రకాష్ కారత్, బృందాకారత్ వంటి హేమా హేమీలంతా వచ్చారు. మోడీ ప్రభుత్వం తీరు పై వారు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడాలనేది నేతల ఆలోచనగా ఉంది. అందుకే కాంగ్రెస్ ను కలుపుకు పోదామనే ఆలోచన చేస్తున్న ఏచూరిని పక్కన పెడదామనుకుంటున్నారు. కానీ మతోన్మాద పార్టీకి వ్యతిరేకంగా ఉంటే చాలు. అంతేగానీ…కాంగ్రెస్ తో మనకు శతృత్వం ఉండాల్సిన అవసరం ఏంటనేది మరోవైపు కొందరి వాదన. 
మొత్తంగా పార్టీ అంతర్గత విషయాలతో పాటు దేశంలోని తాజా రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నారు నేతలు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని వారు ఎలుగెత్తి చాటుతున్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసేవారందరికీ రెడ్ సెల్యూట్ చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటం నేటికి తమకు స్ఫూర్తి అనిచెప్పారు. ఫ్యాసిస్టు శక్తులను ప్రతిఘటించేందుకు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని కమ్యూనిస్టు నేతలు  పిలుపు ఇచ్చారు. వామపక్షాలు ఒక్కటైతే మంచిదనే అభిప్రాయం ఈ మహాసభల్లో వ్యక్తమైంది.  బీజేపీ సర్కారు మేధావులు, శాస్త్రవేత్తలు, రచయితలు, విద్యావేత్తలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. హేతువాదులను చంపేసినా చర్యలు తీసుకోవడం లేదు. అదే విషయం పై మహాసభల్లో పెద్ద ఎత్తునన చర్చ జరిగింది. దళితులపై దాడులు పెరిగిపోయాయి. లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. బీజేపీ నేతలే ఇందులో నిందితులుగా ఉన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యంలో ఏ రకమైన పాత్ర పోషించని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు వినాశకర విధానాలకు తెరతీశాయనే అభిప్రాయం వ్యక్తమైంది. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.