సి.ఎంలు సమాచారం ఇచ్చే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలట

కేంద్ర హోం శాఖ కొత్త రూల్ పెట్టింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల పర్యటనలకు ముఖ్యమంత్రులు వెళ్లవద్దని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. భద్రతాపరమైన సమస్యలు వస్తాయని భావించడమే ఇందుకు కారణం. ఆ రాష్ట్రంలో ఉన్న భద్రతా సిబ్బంది… ముఖ్యమంత్రికి సంబంధించిన విషయాలు చూసుకోవాలి. అదే సమయంలో జెడ్ కేటగిరీ ఉన్న మరో సి.ఎం వస్తే హఠాత్తుగా సెక్యూరిటీ కల్పించడం ఇబ్బందిగా ఉందంటున్నారు. అందుకే ఈ పనిచేసినట్లు సమాచారం. 
                             వాస్తవంగా సి.ఎం చంద్రబాబునాయుడు ఎక్కువగా హైదరాబాద్ కు వస్తుంటారు. వెళుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చేశారా లేక అందరి కోసం ఇలా చేశారా అనే విషయం చర్చనీయాంశమైంది. సాధారణంగా సి.ఎంలు వస్తుంది.. వెళుతుంది.. ఆయా రాష్ట్రాల పోలీసు బాస్ లకు సమాచారం ఇస్తే చాలు. కానీ ఇప్పుడు కొత్త పితలాటకం పెట్టడం ఆశ్చర్యమే. ఆతిథ్యమిచ్చే రాష్ట్రం వచ్చిన ముఖ్యమంత్రికి ఒక్కోసారి సరైన సదుపాయాలు కల్పించలేకపోవచ్చు. అందుకే ఎటువంటి లోటు లేకుండా ఇలా చేయాలని చాలా పద్దతిగా చెబుతోంది కేంద్ర హోంశాఖ. వారి భధ్రత, బసను ఆతిథ్య రాష్ట్రం ఏర్పాటు చేయగలగుతుందని చెబుతోంది. పని ఉన్నప్పుడు తప్ప ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి మరో రాష్ట్రానికి వెళ్లరు. కానీ తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇందుకు భిన్నం. తెలంగాణ సి.ఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు. రెండుసార్లు గుడి దర్శనాలకు ఒకసారి అమరావతి రాజధాని శంఖుస్థాపనకు, ఇంకోసారి పరిటాల ఇంట పెళ్లి కోసం. కానీ ఏపీ సి.ఎం చంద్రబాబునాయుడు వందసార్లకు పైగానే హైదరాబాద్ కు వచ్చి వెళుతున్నారు. 
                                      భవిష్యత్ లోను అలా తిరగాల్సి ఉంది. అందుకే ఈ నిబంధన పెట్టారా అనే వాదన లేకపోలేదు. భద్రతాపరంగా చూడటం మంచిదే. అయినా మరీ ఇంత జాగ్రత్తలు అవసరమా అనిపిస్తోంది.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.