సీనియర్ నేత కుటుంబానికి సీఎం షాక్ ఇవ్వబోతున్నారా..?

వచ్చే ఎన్నికల్లో గెలిచి ఏపీలో మరోసారి అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇందుకోసం ఆయన అనేక వ్యూహాలు కూడా సిద్ధం చేశారు. గత ఎన్నికల్లో గెలిచినప్పటికీ కొన్ని లోపాలు జరిగాయని భావిస్తున్న చంద్రబాబు.. ఈ సారి ఒక్క తప్పుు కూడా జరగకూడదని అనుకుంటున్నారట. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలతో పాటు, పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన స్థానాల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకోసం ఇప్పటికే కొంతమందిని ఆయన ఎంపిక కూడా చేసేశారని సమాచారం. అయితే, కొన్ని సమస్యాత్మకమైన నియోజకవర్గాలతో పాటు, టీడీపీ విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న స్థానాలపై ఆయన ఎక్కువ దృష్టి పెట్టారని, అవసరమైతే కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోడానికి సిద్ధపడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి స్థానాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గం పేరు. అక్కడ గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు పోటీ చేసి, వైసీపీ అభ్యర్ధి రోజా చేతిలో ఓడిపోయారు. దీంతో ఆయనను చంద్రబాబు ఎమ్మెల్సీని చేశారు. గాలి అకాల మరణంతో ఆ పదవి ఆయన భార్య సరస్వత్మకు దక్కింది. దీంతో ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబడే అవకాశం లేదు. కాకపోతే గాలి ఇద్దరు కుమారులు ఈ స్థానంపై కన్నేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రత్యర్ధుల స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఈ వ్యవహారంతో గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబంలో ఇంతకాలం చాపకింద నీరులా సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు ఇంటి గడప దాటడంతోనే అధిష్టానం దృష్టి ఆ స్థానంపై పడింది. అందుకే ఆ కుటుంబంలోని ఎవరికీ టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రోజాలాంటి బలమైన ప్రత్యర్ధిని ఓడించాలంటే కఠిన నిర్ణయం తీసుకోకతప్పదని సీఎం సన్నిహితుల వద్ద అన్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.