సీఎం ప్లాన్.. టీడీపీ ఎమ్మెల్సీకి మరో కీలక పదవి

నవ్యాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ.. మరోసారి ఆ ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకోసం ఆ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. 2014లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుభవానికే జై కొట్టారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణంతో పాటు పలు సంక్షేమ పథకాలు, అభివృధ్ధి పనులు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నారు. అందుకే ఏ సర్వే నిర్వహించినా ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగబోతుంది తెలుగుదేశం పార్టీ. ఇందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పార్టీలోని ఓ ముఖ్య నేతకు కీలక బాధ్యతలు అప్పగించారు. తద్వారా పార్టీలోని సమర్ధవంతమైన నేతలను గుర్తించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారు.

ఈ మధ్య తరచూ వార్తా పత్రికల్లో, న్యూస్ చానెళ్లలో కనిపిస్తూ, ప్రత్యర్ధులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ దూసుకుపోతున్న ఎమ్మెల్సీ, శాసనమండలి విప్‌ బుద్దా వెంకన్నను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు చంద్రబాబు. అంతేకాదు, బుద్దా వెంకన్న బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కావడం కూడా టీడీపీ ఒక రకంగా ప్లస్ అని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అలాగే ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా స్పందిచాల్సిన అవసరం ఉండడంతో చంద్రబాబు అధికార ప్రతినిధులను నియమిస్తున్నారు. ఇదే నెలలో గుంటూరు జిల్లా నుంచి పార్టీకి విశేష సేవలు అందిస్తున్న సాదినేని యామినిని పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు ఏపీ ముఖ్యమంత్రి. పార్టీ అభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రతిపక్షాలకు నష్టమో కాదో కానీ టీడీపీకి మాత్రం లాభమేనని చెప్పవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.