కీలక నేతలకు సీఎం సీక్రెట్ కాల్స్

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. మరోసారి ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అందుకోసం ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక వ్యూహాలు రచిస్తున్నారు. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండడం.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ బలంగా తయారవుతుండడంతో టీఆర్ఎస్‌లో కలవరం మొదలైందట. దీనిని అధిగమించేందుకు కేసీఆర్ చాలా ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. దీనితో పాటు, వచ్చే ఎన్నికల్లో నిలబెట్టబోయే అభ్యర్ధుల విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. గెలుస్తారనే నమ్మకం ఉన్న వారికే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్న కేసీఆర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే పలుమార్లు సర్వేలు కూడా చేయించారు. వీటిలో అనుకూల ఫలితాలు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడంతో పాటు, ప్రతికూల ఫలితాలు వచ్చిన ఎమ్మెల్యేలను లాస్ట్ ఛాన్స్ ఇవ్వడంగానీ, టికెట్ ఇవ్వకుండా సాగనంపడంగానీ చేయాలని డిసైడ్ అయ్యారని, ఈ విషయాన్ని వారికే స్వయంగా చెప్పరని టాక్ వినిపిస్తోంది. ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఎదురు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఇదే తరహా సర్వే పలుమార్లు చేసిన కేసీఆర్.. తాజాగా మరోసారి చేయించారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సర్వే ఫలితాలను మాత్రం మీటింగ్ పెట్టకుండానే సదరు ఎమ్మెల్యేలకు చేరవేయాలని పార్టీలోని సీనియర్ నేతలతో చెప్పారట గులాబీ బాస్. అందుకోసం సీఎం ఫోన్ కాల్ ఆప్షన్ మంచిదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇది తెలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో సీక్రెట్‌ ఫోన్‌కాల్‌ గుబులు రేపుతోంది. దీని ప్రకారం ఫోన్‌కాల్‌ వచ్చిన వారికే టికెట్‌ ఖరారైనట్లని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ కాల్ వ్యవహారం ఆ పార్టీ నేతలను కుదిపేస్తుందని సమాచారం. ఈ విషయంలో భయపడిపోతున్న నేతల్లో కొందరు కేసీఆర్‌ను కలిసి ప్రాధేయపడుతున్నారని, ఆయన దగ్గరకు వెళ్లలేని మరికొందరు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును కలుస్తూ తమ గోడును వెల్లగక్కుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ దీనినే ఫైనల్ చేశారా లేదో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.