చింతమనేని విషయంలో సీఎం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరోసారి విజయం సాధించేందకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ఎన్నికల్లో ప్రతికూలంగా ఉన్న అంశాలపైనే ఎక్కువగా దృష్టి సారించిన ఆ పార్టీ అధిష్టానం.. వాటిని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీకి నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్న టీడీపీ.. అవసరమైతే సిట్టింగులను కూడా పక్కన పెట్టాలనుకుంటోంది. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టేసింది. గెలుపు గుర్రాలను అన్వేషించి, వారికే మెజారిటీ స్థానాలను కట్టబెట్టాలనుకుంటున్న టీడీపీ అధిష్టానం.. అందుకోసం ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నట్లు టాక్. కొద్దిరోజుల్లో కొంత మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటిస్తారని ఆ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే మొదటి జాబితాపై ఒక అంచనాకు వచ్చిందట ఆ టీడీపీ అధిష్టానం. దీనిని చంద్రబాబు ఫైనల్ చేసిన వెంటనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ జాబితాలో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయనకు సిట్టింగ్ స్థానాన్ని కేటాయించకూడదని చంద్రబాబు డిసైడయ్యారని టాక్ వినిపిస్తోంది. గతంలో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత టీడీపీ ఎంపీ మాగంటి బాబు కుమారుడికి దెందులూరును కేటాయించి చింతమనేనికి కృష్ణా జిల్లా నూజివీడు అసెంబ్లీ స్థానం కేటాయించనున్నారని అక్కడ జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్ధి వెంకట ప్రతాప్ గెలుపొందారు. అందుకోసమే అక్కడ చింతమనేని వంటి బలమైన నేతను బరిలోకి దింపితే టీడీపీకి తిరుగుండదని చంద్రబాబు భావిస్తున్నారట. దీంతో 2014లో అక్కడ పోటీ చేసిన టీడీపీ నేత పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

చింతమనేని ప్రభాకర్ టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలలో దూకుడు స్వభావం కలిగిన నేత అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఈ స్వభావమే చాలా సార్లు చిక్కులు తెచ్చి పెట్టింది కూడా. అప్పట్టో కాంగ్రెస్ మంత్రి, ఎంపీపై చేయి చేసుకుని సంచలనానికి తెరలేపారు. దానికి సంబంధించిన కేసులో ఆయనకు శిక్ష కూడా పడింది. దాని తర్వాత ఎమ్మార్వో వనజాక్షిపై దాడి అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ విషయంలో చింతమనేని ప్రభాకరే అందరి కంటే ముందు స్పందించారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. తన రాజీనామా లేఖను తీసుకొని బాబును కలిశారు. వరుసగా ఆయనపై వస్తున్న ఆరోపణలతో చంద్రబాబు సీరియస్ అయ్యారని, అప్పటి నుంచి చింతమనేని సైలెంట్ అయ్యారని టీడీపీలో ప్రచారం జరిగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.