కమలం చేతిలో పవన్ కీలు బొమ్మ

నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న చంద్రబాబు కేంద్రంపై విమర్శల దాడిని పెంచారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఏపీ ప్రజల అండతో అందరికీ వచ్చే ఎన్నికల్లో సమాధానం చెబుతానని చంద్రబాబు అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సైతం బీజేపీ చేతిలో కీలు బొమ్మలా మారారు. అందుకే తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎయిర్‌ ఏషియాలో ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే తనపై ఆరోపణలు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందులో చంద్రబాబు పాత్ర లేదు. వారు మాట్లాడుకున్న సందర్భంలో మాటలు వచ్చినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదు. కానీ దాన్ని జగన్ మీడియా బూతద్దంలో చూపించే ప్రయత్నం చేసింది. మరోవైపు చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న మీడియా వ్యతిరేక వార్తలు ఇచ్చాయి. ఫలితంగా మీడియా వర్గాలు చీలిపోయిందని అర్థమవుతోంది.

తనపై బురద జల్లడానికి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన పూజారితో తిట్టిస్తున్నారని చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. పురావస్తు శాఖ పేరుతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, వెంకటేశ్వర స్వామిని కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటే మనం ఊరుకుంటామా అని ప్రశ్నించారయాన. కుట్రలో భాగంగానే రమణ దీక్షితులు.. జగన్‌తో 20 నిమిషాల పాటు మంతనాలు జరిపారని చంద్రబాబు అన్నారు. అందరి ముందు కలవచ్చొ. కానీ అలా కాకుండా జగన్, రమణదీక్షితులు ఏకాంతంగా కూర్చోవడం హాట్ టాపికైంది. ఏలా అయినా తిరుమలను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం కుట్ర పన్నుతోంది. అది జరగనిచ్చేది లేదన్నారు చంద్రబాబు. ప్రజల్లోను బీజేపీ తీరు పై వ్యతిరేకత పెరుగుతోంది. ఏపీకి అన్యాయం జరుగుతున్నా..కొన్ని పార్టీలు బీజేపీకి మద్దతు పలకడాన్ని జనాలు తప్పు పడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.