అధినేత తీరుతో.. వైసీపీలో లుక‌లుక‌లు!

ఎన్నిక‌ల‌కు అన్ని పార్టీలు క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టాయి. ఏ స‌మ‌యానికి ఏ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియ‌క అప్ర‌మ‌త్తంగా ఉన్నాయి. ఇటువంటి వేళ ఎల‌ర్ట్ గా ఉండాల్సిన కీల‌క‌మైన వైసీపీ మాత్రం.. అయోమ‌యంలో కొట్టుమిట్టాడుతుంది. పైగా విప‌క్షంగా చేయాల్సిన ప‌ని గాలికొదిలేసిన పాపం ఇప్పుడిప్పుడే ప్ర‌భావం చూపుతుంది. 2019  ఎన్నిక‌ల్లో తాము ఫలానాచేశామ‌ని  చెప్పేందుకు ఉద్య‌మాలు.. క‌నీసం మంచి కార్య‌క్ర‌మాలు లేవంటూ సీనియ‌ర్లే వాపోతున్నారు. ఇప్పుడైతే.. ఎమ్మెల్యే విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజ‌న్న‌దొర ఏకంగా రాజీనామాకే సిద్ధ‌మ‌య్యాడు. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కోసం తాను ప‌లుమార్లు.. ఉద్య‌మాలు చేసినా.. అధినేత జ‌గ‌న్ నుంచి క‌నీస స్పంద‌న లేదంటూ వాపోయాడు. దీనికి  ఆ పార్టీ ద్వార‌పురెడ్డి జ‌గ‌దీష్ మ‌ద్ద‌తు ప‌లికారు. ఇదే కొన‌సాగితే.. తాము పార్టీను వీడేది ఖాయ‌మంటూ హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే సికాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని వైసీపీ నేత‌లు.. టీడీపీ, జ‌న‌సేన‌లోకి వ‌ల‌స వెళ్లేందుకు మంత‌నాలు ప్రారంభించారు.
సీనియ‌ర్లు కూడా త‌మ‌కు స‌రైన న్యాయం జ‌ర‌గ‌ట్లేద‌ని.. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు కేటాయింపులో త‌మ‌కు అన్యాయం త‌ప్ప‌ద‌నే అభిప్రాయానికి వ‌చ్చారు.  కృష్ణాజిల్లాల్లోనూ వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ చేరాడు. పైగా.. మంత్రి దేవినేని నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రంలో తిష్ట‌వేశాడు. అక్క‌డ త‌న‌కు సీటివ్వాలంటూ అధినేత‌పై ఒత్తిడి పెంచాడు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న జోగు ర‌మేష్‌కు మింగుడుప‌డ‌కుండా  వుంది. విజ‌య‌వాడ‌లో గౌతంరెడ్డికి పెత్త‌నం ఇవ్వ‌టం..తో వంగవీటి రాధా, అటు అంబ‌టి రాంబాబు వంటి కాపునేత‌లు గుర్రుగా ఉన్నారు. నెల్లూరులో ఆనం రాంనారాయ‌ణరెడ్డి కూడా సైకిల్ దిగి ఫ్యాన్ కింద‌కు రావ‌టంతో అప్ప‌టి వ‌ర‌కూ వున్న వైసీపీ నేత‌లు కంగుతిన్నారు. దీంతో సీటుపై గంపెడాశ‌లు పెట్టుకున్న సీనియ‌ర్లు త‌మ గూటిలో కూడా వ‌ల‌స‌లు చేర‌తార‌నే ఆందోళ‌న‌లో ఉన్నారు. దీంతో. పార్టీలో  సైలెంట్‌గా లుక‌లుక‌లు.. పార్టీను ఇరుకున పెడుతున్నాయ‌ట‌. అయితే.. ఇదే విష‌యాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు  ఎవ‌రూ సాహ‌సించ‌లేక‌పోతున్నార‌ట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.