రాజమౌళి-రామోజీరావు మధ్య బయటపడ్డ విభేదాలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వార్త కలకలం రేపుతోంది. ఒకరు సినీ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్.. పత్రికా రంగంలో మోస్ట్ సీనియర్ ఇంకొకరు.. అలాంటి ఇద్దరి గురించి ఏదైనా వార్త వస్తే, అది సంచలనమే అవుతుంది. తాజాగా వచ్చిన వార్త ఆ కోవకు చెందినదే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, ఈనాడు పత్రిక అధినేత రామోజీరావుకు మధ్య విభేదాలు వచ్చాయనేది ఆ వార్త సారంశం. ఉన్నట్టుండి ఈ వార్త రావడానికి కారణమేంటి..? నిజంగానే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయా..? అసలు వీరిద్దరికీ విభేదాలు ఎందుకొచ్చాయి..?

రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా షూటింగ్.. ఎక్కువ శాతం రామోజీ ఫిలిం సిటీలోనే జరిగింది. దీనికి సంబంధించిన లావాదేవీల విషయమై వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది. గతంలోకి వెళ్తే.. ఈ వార్త నిజమేనన్న సందేహం రాక మానదు. ఎందుకంటే బాహుబలిని తన సొంత సినిమాలా ఫీలయ్యారు రామోజీరావు. తన మీడియాలో ఏ సినిమాకూ చేయనంత ప్రచారం కల్పించారు. సినిమాకు కొంత ఫైనాన్స్ కూడా పెట్టారనే టాక్ కూడా వచ్చింది.

తన సినిమాను ఆయన సొంత సినిమాలా భావించిన రామోజీతో.. బాహుబలి రెండు పార్టుల శాటిలైట్ రైట్స్ మీకే ఇస్తానని చెప్పాడట రాజమౌళి. కానీ రాజమౌళి ఆ సినిమా రైట్స్‌నే వేరే ఛానెల్‌కు అమ్ముకున్నాడు. ఇదే రామోజీ ఆగ్రహానికి కారణమట. దీని తర్వాత షూటింగ్ నిమిత్తం ఫిలిం సిటీకి కట్టవలసిన బకాయిల మొత్తాన్ని ఇవ్వమని చిత్ర బృందం కోరిందట. దీనికి రామోజీ ఫిల్మ్‌సిటీ దాదాపు రూ.90 కోట్ల బిల్ వేశారని, దానిని చూసిన రాజమౌళి ఖంగుతిన్నారని సమాచారం.

దీనికి మారు మాట్లాడకుండా చిత్ర బృందం మొత్తం బిల్ కట్టేశారని తెలుస్తోంది. అయితే ఈ పరిణామం తర్వాత రాజమౌళి.. తన తదుపరి సినిమాల కోసం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడట. అందుకే త్వరలో ప్రారంభం కానున్న మల్టీ స్టారర్ మూవీ కోసం హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడట. దీని కోసం కోటి రూపాయాలతో ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్నాడట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ వార్త మాత్రం బాగా హల్‌చల్ చేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.