అన్న‌కు తెలిసొచ్చింది.. త‌మ్ముడుకి క‌లిసొస్తుందా!

పాలిటిక్స్‌.. ఇది కూడా మ‌త్తులాంటిదే.. ఒక్క‌సారి ఎక్కితే.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాల‌నే లాగుతుంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కుర్రాళ్లు.. వెండితెర‌పై ఉబ‌లాట‌ప‌డేవారు.. ఫ్రెండ్స్ అందంగా ఉన్నావంటూ పొగిడితే చాలు.. రైలెక్కి మ‌ద్రాసు చేరిన వారెంద‌రో ఉన్నారు. అటువంటిలో ఏ కొంద‌రో స్టార్లు.. సూప‌ర్‌స్టార్లు కాగ‌లిగారు. ఇప్పుడు అంతా క‌ల‌ర్‌.. క‌ల‌రింగ్ కోసం.. పాలిటిక్స్ అనేది అల‌వాటు చేసింది మాత్రం..న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు.. రాజ‌కీయాల్లో రాణించినా.. చివ‌రి ద‌శ‌లో ఆయ‌న కూడా మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. జ‌మున, గుమ్మ‌డి, జ‌గ్గ‌య్య‌, శార‌ద‌, కృష్ణ ద‌గ్గుబాటి రామానాయుడు, కోట శ్రీనివాస‌రావు వంటి పెద్ద‌న‌టులు కూడా రాజ‌కీయాల్లోకి చేరి.. పూర్తికాలం నెగ్గ‌లేక‌పోయారు. అమ్మో.. ముఖానికి రంగులేసుకుని న‌టించ‌ట‌మే తేలిక‌.. రాజ‌కీయాల్లో న‌టించ‌టం చాలా క‌ష్ట‌మంటూ వెనక్కి వ‌చ్చారు. ఆ త‌రువాత చిరంజీవి.. ఏకంగా ప్ర‌జారాజ్యం పార్టీతో సీఎం కావాల‌ని క‌ల‌లు క‌న్నారు. వాస్త‌వానికి.. అంత స్టామినా.. ఉన్నా.. 2009లో వైఎస్ హ‌వా కొన‌సాగుతుంది. పైగా.. ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా వ్య‌తిరేక‌త లేదు. ధీటుగా. టీడీపీ కూడా అధికారం కోసం పోటీప‌డుతుంది.

మ‌ధ్య‌లో చేరిన మూడో పార్టీగా.. ప్ర‌జారాజ్యం పార్టీ అనుకున్నంత నెగ్గ‌క‌లేక‌పోయింది. పైగా.. చిరంజీవిని వెండితెర‌పై పూజించిన అభిమానులు.. రాజ‌కీయ నేత‌గా ఊహించుకోలేక‌పోయారు. పైగా.. బావ‌మ‌రిది అల్లు అర‌వింద్ రూపంలో పార్టీ ప్ర‌తిష్ఠ‌ను మ‌స‌క‌బార్చారు. టికెట్లు అమ్ముకున్నార‌నే అప‌వాదును మూట‌గ‌ట్టుకున్నారు. అయినా.. కొన్ని సీట్లు .. ల‌క్ష‌లాది మంది మ‌ద్ద‌తు పొందిన చిరంజీవి.. పార్టీన‌డ‌ప‌టం అంత ఈజీ కాద‌ని భావించి హ‌స్తం పార్టీలో విలీనం చేశారు. దీనికి అంత‌ర్గ‌తంగా కార‌ణాలేమైనా.. ప్ర‌జ‌ల్లో ప్రాంతీయ పార్టీలు.. ముఖ్యంగా కొత్త‌గా పుట్టుకొచ్చే పార్టీల ప‌ట్ల వ్య‌తిరేక‌త‌కు ఓ విధంగా చిరంజీవి పునాదిరాళ్లు వేశార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఇప్పుడు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన‌తో జ‌నంలోకి వెళ్తున్నారు. త‌మ్ముడు ఆలోచ‌న‌లు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా యువ‌త‌లో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది.. అది ఓటింగ్ వ‌ర‌కూ వ‌స్తుందా అనేది ప‌క్క‌న‌బెడితే. ప‌వన్ మాట‌లు.. జ‌నాల్లోకి బాగానే వెళ్తున్నాయి. కొన్ని ప‌రిణితితో మాట్లాడితే.. మ‌రికొన్ని వివాదాస్పద‌మ‌వుతున్నాయి. ఏమైనా.. ప‌వ‌న్ కూడా రాజ‌కీయ నాయ‌కుడే అనేది ప్ర‌జాపోరు యాత్ర‌తో నిరూపించుకున్నాడు. కానీ.. కోట శ్రీనివాస‌రావు వంటి సీనియ‌ర్లు మాత్రం.. ఎందుకండీ.. ప‌వ‌న్‌కు రాజ‌కీయాలు.. సినిమావాళ్లం మేం మాత్రం.. రాజ‌కీయాల్లో ఏం బావుకున్నామంటూ హిత‌వు చెబుతున్నారు. ఇంకొంద‌రైతే.. అన్న‌కు.. ఐదేళ్ల‌కు తెలివివ‌చ్చింది. ఎంచ‌క్కా.. తిరిగి వెండితెర‌పై స్టార్‌గా మారారు. అదే దారిలో త‌మ్ముడు ప‌రిస్థితుల‌ను ఎదిరిస్తాడా.. తెలిసొచ్చాక‌.. తిరిగి వ‌స్తాడా అనే అంశంపై చ‌ర్చించుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.