పవన్ పంచన చిరు ఫ్యాన్స్, లోక్‌సత్తా గణం, వామపక్షాలు?

తాను ఇరవై అయిదేళ్ల పాటు రాజకీయాల్లో ఉండేందుకే వచ్చానని, ప్రజలు తనకు మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా వారి కోసం పోరాటం చేస్తానని జనసేనాని, పవర్‌స్టార్ట్ పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా ఏమిటో చూపించే విధంగా, పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు పవన్ కసరత్తులు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే చిరంజీవి అభిమానులు పవన్ కు మద్దతు పలకగా, తాజాగా లోక్‌సత్తాకూడా పవన్‌కు మద్దతు పలికేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి అభిమానులు, లోక్‌సత్తా పార్టీ నేతలతో పాటు ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన పలువురు నేతలు పవన్ కళ్యాణ్ వెంట అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతోంది.  ప్రస్తుతం లోక్ సత్తా పార్టీ నాయకులుగా కొనసాగుతున్న పలువురు జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరు జనసేన వర్గాలతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం.
అయితే ఇందుకోసం వీరు పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. లోక్‌సత్తా పార్టీ నాయకుడు కటారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సత్తా పార్టీ జనసేన లో విలీనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు ఊహాగానాలు చేస్తున్నప్పటికీ ఇంకా స్పష్టత రావాల్సివుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు జనసేనలో చేరారు. పవన్ కూడా యువతపై దృష్టి సారించారు. లెఫ్ట్ పార్టీలతో కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే, లోక్‌సత్తా పార్టీ రాజకీయాల్లో విఫలమైనట్టు కనిపిస్తున్నప్పటికీ ఆ పార్టీకి, పార్టీ నేతలకు మంచి పేరు ఉంది. మరోవైపు క‌మ్యూనిస్టులు, జ‌న‌సేన మ‌ధ్య ఎన్నిక‌ల పొత్తు దాదాపు ఖాయం అయ్యిందనే వార్తలు వచ్చాయి.
హైద‌రాబాద్ లోని జ‌న‌సేన కార్యాల‌యంలో క‌మ్యూనిస్టులతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్వ‌హించిన స‌మావేశంలో సాగిన చ‌ర్చ‌లు ఒక కొలిక్కి వచ్చినట్లు భోగట్టా!తెలుస్తోంది. ఎన్నిక‌ల్లో తాము క‌లిసి ప‌నిచేస్తామ‌ని జ‌న‌సేన నేత‌లు ప్ర‌క‌టించ‌డం అందుకు నిద‌ర్శ‌నంగా నిలిచింది. దీనికి అనుగుణంగా వివిధ స‌మ‌స్య‌ల‌పై ఉమ్మ‌డిగా రంగంలోకి దిగేందుకు కార్యాచరణ సిద్దం చేశారని తెలుస్తోంది. ఈ నేపద్యంలోనే విజ‌య‌వాడ‌లో భారీ బ‌హిరంగ‌స‌భ‌కు స‌న్నాహాలు చేస్తున్నారట! అలాగే వామపక్షాలతో కలిసి పవన్ అభిమానులు రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌స్సు యాత్ర నిర్వహించే ప్ర‌ణాళిక కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీనికితోడు వివిధ పార్టీల్లో అసంతృప్తితో వేగిపోతున్నవారు కూడా పవన్ వెంట వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.