త‌మ్ముడి పార్టీలో అన్న‌య్య అనుచ‌రుడి కీల‌క‌పాత్ర‌

కేంద్ర మాజీమంత్రి, న‌టుడు చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీకి ఎన‌లేని సేవ‌లు చేశారు. ఇప్పుడు ఆయ‌న ప‌వ‌న్ పార్టీ జనసేన లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శిగా ఉన్న ఆయన తాజాగా త‌న‌ పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆ పార్టీ సభ్యత్వానికి కూడా గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌తో స్వామినాయుడు జ‌న‌సేన‌ పార్టీలో చేరిక‌పై చ‌ర్చ‌లు జ‌రిపార‌ని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ నెల 9వ తేదీన పవన్ సమక్షంలో స్వామినాయుడుతో పాటు చిరంజీవి అభిమానులు జనసేన పార్టీలో చేరనున్నార‌ని సమాచారం. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన‌ సమయంలో స్వామినాయుడు కీలకంగా వ్యవహరించారు. త‌రువాత చోటుచేసుకున్న ప‌రిణామాల‌తో పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం విదిత‌మే. అప్ప‌టి నుంచి స్వామినాయుడు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామినాయుడు సహా చిరు అభిమానులు జనసేనలో చేరడం ఆస‌క్తిక‌రంగా మారింది. అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన‌ నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ మొద‌లైవారంతా జనసేనానికి అండగా ఉంటార‌ని తెలుస్తోంది. కాగా తాను జనసేనలో చేరే అంశంపై స్వామినాయుడు.. ఇటీవ‌ల‌ చిరంజీవితో చర్చించారని తెలుస్తోంది. ఈ చర్చలలో రాజకీయపరమైన నిర్ణయాన్ని చిరంజీవి… స్వామినాయుడికే వదిలేశారని తెలుస్తోంది. దీంతో స్వామినాయుడికి చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించిన‌ట్ల‌య్యింది.  ఫ‌లితంగా  చిరంజీవి ఫ్యాన్స్ పవన్‌కు అండగా ఉండాలని నిర్ణయించుకున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కాగా చిరు అభిమానులు జనసేనలో చేరే కార్యక్రమాన్ని ఘ‌నంగా నిర్వహించాలని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.. వీరందరినీ ఉద్దేశించి పవన్ ప్ర‌త్యేకంగా మాట్లాడ‌తార‌ని స‌మాచారం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.