పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో చిరంజీవికి ఇబ్బంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. జనయాత్రలో అపశృతులు ఆగడం లేదు. తొలి రోజు కారు అద్దాలు పగిలి ఒక అభిమానికి గాయమైంది. ఆ తర్వాత రోజు గుర్తు తెలియని వ్యక్తి అజ్ఞాతం నుంచి పవన్ మీద చెప్పు విసిరాడు. అతను ఎవరో పట్టుకునే లోపే పారిపోయాడు. అతని కోసం పవన్ ఫ్యాన్స్ వేట సాగించినా ఫలితంలేదు. పవన్ కల్యాణ్ ఖమ్మం రాజకీయ యాత్రలో మరో ఇబ్బంది వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడికి ఒక పోలీసు అధికారి ఆస్పత్రిపాలయ్యాడు.
పవన్ ను చూసేందుకు అభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. వారిని అదుపు చేయబోయిన ఖమ్మం రూరల్ ఎస్సై చిరంజీవి కాలు విరిగింది. పవన్ కల్యాణ్ వేదిక మీదకు రాగానే ఆయన కోసం అభిమానులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. వారిని అదుపు చేయడం కష్టమైపోయింది. ఫలితంగా పోలీసులు లాఠీచార్జీ చేశారు. అంతే ఒకేసారి అంతా ఒకేవైపు పరుగెత్తారు. ఆ పరిస్థితిలో ముందు ఉన్నది పోలీసా.. మరో వ్యక్తినా అనేది ఆ మాబ్ లో తెలిసే అవకాశం లేదు. అంతే అక్కడున్న ఎస్సై చిరంజీవి కాలికి తీవ్రగాయమైంది. ఆ తర్వాత ఆయన్ను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. 
పవన్ పై ఎలాగు రాజకీయ విమర్శలు సాధారణంగానే వస్తున్నాయి. విచిత్ర మాటలు, వింత మాటలు చెబుతున్నారు పవన్ కల్యాణ్. తన మాటలకు ఒక స్టాండ్ అంటూ లేకుండా పోయింది. విహెచ్ ను సి.ఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రచారం చేస్తానని చెప్పాడు పవన్. ఇటు కేసీఆర్ ను ఇంద్రుడు, చంద్రుడు అన్నారు. నిన్నటిదాక కేసీఆర్ ను తాట తీస్తానన్నాడు. ఇప్పుడు రూటు మార్చారు. ఇదంతా చూస్తుంటే పవన్ కు తిక్కలేచిందా అనే చర్చ సాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.