ఆ క్రిటిక్ బండారం బయట పెట్టిన చిన్మయి

ఏడాదిగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల విషయమై చాలామంది సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఓపెన్ అవుతున్నారు. కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా చేస్తున్న ఆరోపణలు ఎంతటి సంచలనం రేపుతున్నాయో తెలిసిందే. తాజాగా దక్షిణాదిన ఫేమస్ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి సైతం తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి గళం విప్పింది. ఆమె సినీ రంగంలో ఎవరినీ టార్గెట్ చేయలేదు. ఐతే చిన్నతనం నుంచి వివిధ సందర్భాల్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె వరుసగా ట్వీట్లు చేసింది. తనకు 8-9 ఏళ్ల వయసున్నప్పటి నుంచే మగాళ్ల నుంచి వేధింపులు మొదలయ్యాయని చిన్మయి చెప్పింది.
ఆ వయసులో తాను తన తల్లితో కలిసి ఒక రికార్డింగ్ స్టూడియోకు వెళ్లానని.. అక్కడ తాను నిద్ర పోతుండగా.. పూజారి దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి తనను అసభ్యకరంగా తాకాడని చిన్మయి చెప్పింది. తర్వాత తనకు పదేళ్ల వయసుండగా ఒక పెద్ద మనిషి తన ఆఫీసుకు రమ్మని చెప్పి అనుమానాస్పద రీతిలో కౌగిలించుకుని తనను పైకెత్తాడని చెప్పింది. ఇలాంటి అనుభవాలెన్నో చూస్తూనే తాను పెరిగానని చిన్మయి చెప్పింది. ఆన్ లైన్లో తనను వేధించే ప్రయత్నం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కొందరిని అరెస్టు చేయించినట్లు చిన్మయి వెల్లడించింది. ఇలాంటి ఇబ్బందుల విషయమై తనకు సపోర్టివ్వాలని ప్రశాంత్ అనే ఫేమస్ యూట్యూబ్ రివ్యూయర్‌ను కోరితే.. అతను ‘స్వీట్ హార్ట్’ అని సంబోధిస్తూ తనకు అసభ్యంగా మెసేజ్‌ లు పెట్టాడంటూ అతడి బండారం బయటపెట్టింది చిన్మయి. ఆమె ట్వీట్లకు స్పందిస్తూ.. ప్రశాంత్ తమతో కూడా అసభ్యంగా వ్యవహరించాడంటూ పలువురు అమ్మాయిలు ట్వీట్లు పెడుతుండటం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.