చెర్రీ-బోయపాటి సినిమాకు అదిరిపోయే టైటిల్..!

‘రంగస్థలం’ సినిమాతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరోవైపు ‘లెజెండ్’, ‘సరైనోడు’, ‘జయ జానకీ నాయక’ వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఇంక చెప్పేదేముంది. సినిమా అనుకున్నప్పటి నుంచే దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పక్కా మాస్ డైరెక్టర్, ఓ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కలయికలో వస్తున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించి బయటికి వచ్చిన ఓ ఆసక్తికర విషయం మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది. అదే.. ఈ సినిమా టైటిల్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు చిరంజీవి సూపర్ హిట్ మూవీ టైటిల్‌లో మొదటి సగాన్ని పెట్టబోతున్నారట. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు-అతిలోక సుందరి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అదే సినిమా టైటిల్‌లోని మొదటి సగమైన ‘‘జగదేకవీరుడు’’ని ఈ సినిమా కోసం రిజిష్టర్ చేశారట. ఇదే కనుక నిజమైతే మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన ‘‘భరత్ అను నేను’’ ఫేం కియారా అద్వాణీ నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.