టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందన్న చంద్రబాబు

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందనే సంకేతాలిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తన నలబై ఏళ్ల రాజకీయ జీవితం పూర్తైయిన సందర్బంగా ఎన్టీఆర్ ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బగా నలబై కిలోల కేక్ ను కట్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ లో టీడీపీ విలీనంపై వస్తున్న ఉహాగానాలకు ఆయన పుల్ స్టాప్ పెట్టారు. ఏ పార్టీలోనూ తెలగుదేశం పార్టీ  విలీనం జరగదని తేల్చి చెప్పారు. అదే సమయంలో బీజేపీ పొత్తు వద్దనుకుంటోంది. అందుకే మిగిలిన రెండు పార్టీల్లో ఒక పక్షాన వెళతామన్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలను నిలువునా మోసం చేసింది. అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఆ రెండు పార్టీల్లో ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని చెప్పకనే చెప్పారు చంద్రబాబు. అందుకే క్యాడర్ సిద్దంగా ఉండాలనే సంకేతాలిచ్చారు. 
ప్రజా సమస్యలపై నాయకులు తిరుగులేని పోరాటం చేయాలని చెప్పారు బాబు. ఇప్పటికే పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నేతలు వెళ్లిపోయినా క్యాడర్ ఇంకా అంతే ఉంది. అందుకే పార్టీ శ్రేయస్సు కోసం పొత్తు పెట్టుకుంటామన్నారు. నాయకులు పార్టీ వీడినా నష్టం లేదన్నారు. కార్యకర్తలు తెదేపాతోనే ఉన్నారని చెప్పారు. వారిలో ఆత్మస్థైర్యం నూరిపోసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. పార్టీని విలీనం చేస్తామని మాట్లాడే అధికారం, స్వేచ్ఛ ఎవరికీ లేవన్నారు. పరోక్షంగా మోత్కుపల్లి నరసింహులుకు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా అందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఫలితంగా తెలంగాణలో బీజేపీ వద్దు.. టీఆర్ఎస్ ముద్దు అనే సంకేతాలను ఇచ్చేశారు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.