మోడీని కలవనున్న చంద్రబాబు  

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌‌సింగ్‌తో ఏపీ మంత్రులు భేటీ అవడంతో కీలక హామీలు వస్తాయనుకున్నారు. కానీ ఏం జరగలేదు. అంతా ఓపిగ్గా వినడం తప్ప ఏం చేయలేదు. అంతా ప్రధాని మోడీకి వివరిస్తానని చెప్పారు. కేంద్రమంత్రులు అశోకగజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీలు తోట నరసింహం, నిమ్మల కిష్టప్ప, రామ్మోహన్‌ నాయుడులు కాస్త గట్టిగానే తమ వాదన వినిపించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడారు. ఎంపీలందరూ సమావేశాల్లో పాల్గొంటే విషయం లీక్ అవుతుందని చంద్రబాబు భావించినట్లున్నారు. అందుకే అందరూ కీలక నేతల వద్దకు వెళ్లకుండా ఐదుగురితో ఒక కమిటీ వేశారు. వారు వెళ్లి కలిస్తే సరిపోతుందనేది చంద్రబాబు ఆలోచన. అందుకే ఆ ఐదుగురు రాజ్‌నాథ్‌‌సింగ్‌ తో చర్చలు జరిపారు.  
తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. త్వరలోనే ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ అవుతారని, అప్పుడు తాను కూడా అందులో పాల్గొంటానని రాజ్‌నాథ్‌‌సింగ్‌ చెప్పారు. టీడీపీ సమావేశం తర్వాత రాజ్‌నాథ్ సింగ్ సి.ఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన వద్దకు తమ పార్టీ ఎంపీలను పంపారు చంద్రబాబు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని సీఎంకు రాజ్‌నాథ్ సలహా ఇవ్వడంతోనే అక్కడకు పంపాను. రాజ్‌నాథ్ ముందుగా చెప్పినట్లే టీడీపీ ఎంపీలతో మాట్లాడారు. పోలవరం, రైల్వే జోన్ అంశాలను ఏకరవు పెట్టారు నేతలు. ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన నోడల్ ఏజన్సీ హోం శాఖ పరిధిలో ఉంటుంది. అందుకే ఆ సంగతి పట్టించుకోవాలని కోరారు. 
మోడీ అపాయింట్ మెంట్ కోసం బాబు
ప్రధాని మోడీని కలిసి తమ నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు సి.ఎం చంద్రబాబు. ఇందుకు మోడీ అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నారు. ఆయన్ను కలిసి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ అంత తేలికగా మోడీ చంద్రబాబును కలవనిస్తాడా అనేది ఆసక్తికరంగా ఉంది. ఏపీకి నిధులు కేటాయించకుండా అడ్డుపడిన మోడీ.. చంద్రబాబును పిలిచి ఆయన చెప్పినట్లు చేస్తారా అనేది సందేహాస్పదమే. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.