వెళ్లాలా…వద్దా…

బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చింది టీడీపీ. అయినా సరే బీజేపీ మంత్రులు, నేతలు టీడీపీ వారితో మాట్లాడుతున్నారు. రాయబారాలు నెరుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎంపీ సుజనాచౌదరి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రులు సిద్దంగా ఉన్నారు. రమ్మని ఆహ్వానిస్తున్నారు. వెళ్లాలా వద్దా అని అడిగారు. ఇందుకు చంద్రబాబు నుంచి వద్దనే సంకేతాలు అందాయి. మరోవైపు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అదే మాట చెప్పారట. హోదా, ప్యాకేజి, రైల్వే జోన్, ఇతర అంశాలపై స్పష్టత ఇస్తామని.. తన ఛాంబర్ కి రావాలని అరుణ్ జైట్లీ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని అడిగారట. ఇందుకు చంద్రబాబు అనుమతి అడిగారు సుజనా. కానీ అలా వారిని కలవడం వల్ల మన గుడ్ విల్ దెబ్బతింటోంది. అలా వద్దు. మనం హోదా కోసం పోరాడుతున్నాం. ఇలాంటి సమయంలో కలవడం వద్దంటున్నారు.  
అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్రమే అని చంద్రబాబు అంటున్నారు. హామీలు ఇచ్చింది వారే. అమలు చేయాల్సింది వారే. కేంద్ర మంత్రులు ఎక్కడైనా ఎదురైతే మర్యాద పూర్వకంగా మాట్లాడొచ్చు. కానీ వారి ఛాంబర్లకు వెళ్లి కలవడం సరికాదని చంద్రబాబు తెలిపారు. ఆపరేషన్ ద్రవిడ సంగతి వారి మధ్య చర్చకు వచ్చింది. రోజు రోజుకు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ లేకుండా బీజేపీ తప్పించుకుంటోంది. అదే విషయం చర్చకు వచ్చింది. అలా తప్పుకోవడం వల్ల టీడీపీకి మరింత లాభం చేకూర్చనుంది. తాము ఏపీకి న్యాయం చేయాలని కోరుతున్నాం. కానీ బీజేపీ పలాయన వాదం చేస్తుందని చెబుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.