
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారారు. ఇటీవలే పింఛన్లు పెంపు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం, ఫోన్లు, నిరుద్యోగ భృతి పెంపు వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజనులకు 15 సంత్సరాలు పింఛను వయసు తగ్గిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పింఛను పొందే అర్హత 65 ఏళ్లకు వస్తుంది. అయితే, గిరిజనులకు 65 ఏళ్ల దాకా ఇస్తే చాలా ఇబ్బందులు ఉంటాని గమనించిన ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక సడలింపు ఇచ్చారు. ఇక నుంచి 50 ఏళ్లు నిండితే చాలు గిరిజనులకు పింఛను వస్తుంది. దీనికి సంబంధించిన డేటాను సిద్ధం చేయాలని ఎంపీడీవోలకు ఆదేశాలు కూడా ఇచ్చేశారు.
ఇదిలా ఉంటే ఈ నిర్ణయం వెనుక ఓ వ్యూహం ఉందని అంటున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటింది. అరకు, పాలకొండ, కురుపాం, సాలూరు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలను వైసీపీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వారిలో కొందరు టీడీపీలో చేరినా… ఆ నియోజకవర్గాల్లో వైసీపీ పట్ల మొగ్గు ఉంది. అయితే, చంద్రబాబు తాజా నిర్ణయం పరిస్థితులను తీవ్రంగా ప్రభావం చేసే అవకాశం ఉంది. పైగా గిరిజనులు శారీరక కష్టంపై ఆధారపడేవారు. కాబట్టి వారిని ఇతరులతో సమానంగా చూడటం కరెక్టు కాదు. అందుకే వారికి సడలింపు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Be the first to comment