ఏం.. పిచ్చిపిచ్చిగా ఉందా!

1999లో సీఎం చంద్ర‌బాబునాయుడు చూసిన వారు.. ఆయ‌న వ‌ద్ద ప‌నిచేసిన మంత్రులు. అధికారులు.. ఆయ‌న‌తో స‌మావేశం అన‌గానే ఉలిక్కిప‌డేవారు. ఏ మూల నుంచి ఏ ప్ర‌శ్న వేస్తారు. ఏ ప‌ల్లెలో స‌మ‌స్య‌ను లేవ‌నెత్తుతార‌నే విష‌యాల‌పై భ‌య‌ప‌డేవారు. 2019లో ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం చంద్రుడు శాంతిస్వ‌భావం మాత్ర‌మే చూశారు. కానీ.. ఎన్నిక‌లు ముంచుకువ‌స్తున్నాయి. బాబులోనే టెన్స‌న్ మొదైలంది. ఇక్క‌డ చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త విష‌యాల్లోకి వెళితే.. అధినేత‌గా బాబు.. కాస్త ఒత్తిడికి గురైన‌పుడు మాత్ర‌మే స‌మ‌ర్ధవంతంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే నానుడి ఉంది. అటువంటి నేత‌.. ఇప్పుడు చంద్ర‌నిప్పులు కురిపించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇటు అమ‌రావ‌తి, అటు పోల‌వ‌రం, మ‌రోవైపు ఉక్కుఫ్యాక్ట‌రీ.. మూడు ప్రాంతాల‌కు అవ‌స‌ర‌మైన కీల‌క ప్రాజెక్టులు. కానీ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదే విష‌య‌మై మొన్న కృష్ణా, నిన్న ప్ర‌కాశం జిల్లా నేత‌ల‌కు బాబు తీసుకున్న క్లాసుతో దెబ్బ‌కు దెయ్యం వ‌దిలిన‌ట్ట‌యింది. ఇది మిగిలిన నేత‌ల‌కూ హెచ్చ‌రిక‌గా నేత‌లు భావిస్తున్నారు. ఈ ప‌ని ఏడాది ముందే చేసుంటే.. ఇప్పుడింత వ‌ర‌కూ వ‌చ్చేది కాద‌నే ప్ర‌చారం సాగుతుంది. ఇప్పుడు వంతు ఎంపీల ఖాతాలోకి చేరింది. పైగా అంద‌రూ పెద్ద‌లు అవంతి శ్రీనివాస్‌, ముర‌ళీమోహ‌న్‌, కేశినేని నాని, మాగంటి బాబు, రాయ‌పాటి, గ‌ల్లా వంటి ఉద్దండులు.. మ‌రి వీళ్లు కూడా ఏపీ భ‌వ‌న్‌లో క‌డ‌ప‌లో సీఎం ర‌మేష్ చేప‌ట్టి దీక్ష‌పై చ‌లోక్తులు విసిరితే బాబు చూస్తూ ఊరుకుంటారా! సీరియ‌స్ విష‌యాన్ని స‌ర‌దాగా భావించి ఇలాంటి మాట‌లు మాట్లాడేందుకు మ‌న‌సెలా వ‌చ్చిందంటూ ఎంపీల‌కు బాగానే క్లాసు తీసుకున్నార‌ట‌. పైకి ఎంపీలు.. అబ్బే.. అవ‌న్నీ విప‌క్షాల కుట్ర అంటూ చెబుతున్నారు.. కానీ వాస్త‌వం మాత్రం బాబు వ‌ద్ద ఉన్న‌ట్లు స‌మాచారం. ఐదు కేజీల బ‌రువు త‌గ్గేందుకు తాను దీక్ష చేస్తానంటూ ముర‌ళీమోహ‌న్‌, అటు అవంతి శ్రీనివాస్‌లు చ‌లోక్తులు విసురుకోవ‌టం.. దాన్ని అంద‌రూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే.. తాము మాట్లాడిన మాట‌లు క‌ట్ చేశారంటూ ముర‌ళీమోహ‌న్ స‌మ‌ర్ధించుకునే ప్ర‌య‌త్నం చేసినా బాబు మాత్రం.. అన్నీ త‌న‌కు తెలుసంటూ తేల్చి చెప్పార‌ట‌. ఇక‌పోతే.. వీడియో దృశ్యాలు.. ప్ర‌సారం.. వంటి అంశాల‌పై ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. ఏపీ ప‌రువును ఢిల్లీ వీధుల్లో తీసిన వారు ఎవ‌రైనా.. క్ష‌మార్హం కాదంటూ మండిప‌డ్డార‌ట‌. ఓ ఎంపీనైతే.. ఏం పిచ్చిపిచ్చిగా ఉందా!
అంటూ గ‌ట్టిగానే మంద‌లించార‌ని స‌మాచారం. పాపం.. అస‌లే.. ప‌రువు పోయి బాధ‌ప‌డుతుంటే.. బాబు క్లాసుతో.. ఎంపీల‌కు దిమ్మ‌తిరిగిన‌ట్ల‌యింద‌ట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.