చంద్రబాబు సూపర్ ప్లాన్.. టీడీపీలోకి బీజేపీ ఎంపీ

ఏపీలో 2019 జరగబోయే ఎన్నికలు అటు అధికార పక్షానికి.. ఇటు వైసీపీ, బీజేపీ, జనసేనలకు ప్రతిష్టాత్మకమైనవి. ఈ ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండో సారి అధికార పీఠం దక్కించుకోవాలని టీడీపీ, తొలిసారి ముఖ్యమంత్రి అవ్వాలని జగన్, పవన్.. ఏపీలో బలపడాలని బీజేపీ భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా అన్ని పార్టీలు ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి. అలాగే గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి పని చేసిన టీడీపీ.. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతుంది. ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.

విభజన హామీల విషయంలో టీడీపీని, ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీ గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోయారు సీఎం చంద్రబాబు. అందుకోసం ఎన్డీయే నుంచి బయటికొచ్చేశారు. అంతేకాకుండా బీజేపీ చేసిన మోసాన్ని ఏపీ ప్రజలకు చెప్పడంలో ఆయన సక్సెస్ అయ్యారు. చంద్రబాబు తమకు ఎదురు తిరగడాన్ని జీర్ణించుకోలేని బీబేపీ.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీతో తెరవెనుక రాజకీయాలు నడుపుతోందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుపై లేని పోని ఆరోపణలు చేసి ఇరుకున పెట్టాలని భావిస్తోంది. అలాంటి తరుణంలో చంద్రబాబు సూపర్ ప్లాన్ వేశారు. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఏపీ బీజేపీకి అధ్యక్షుడిగా పని చేసిన ఎంపీ కంభంపాటి హరిబాబును టీడీపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఆయన రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన భాజాపా అధ్యక్షులు అయ్యారు. నాలుగేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. మిత్రధర్మం పాటిస్తూ మృధుస్వభావిగా పేరు తెచ్చుకున్నారు. ఏనాడూ టీడీపీని గానీ, చంద్రబాబును గానీ విమర్శించలేదు. దీంతో ఆయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దించేశారు. ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు కొందరు నేతలను ఆయన వద్దకు పంపి, టీడీపీలోకి రావల్సిందిగా కోరారట. దీనికి ఆయన కూడా ఓకే చెప్పేశారని టాక్ వినిపిస్తోంది.

హరిబాబు టీడీపీలోకి వస్తే 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచే మళ్లీ హరిబాబు పోటీ చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఆయనతో పాటు ఏపీలో బీజేపీలోని మోస్ట్ సీనియర్ లీడర్, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్గంలోని దాదాపు 20 మంది నాయకులను తీసుకుని వచ్చేందుకు హరిబాబు సిద్ధంగా ఉన్నారట. అన్నీ కుదిరితే ఆయన జూలై మొదటి వారంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. మరి చంద్రబాబు కొట్టిన ఊహించని ఎదురుదెబ్బ నుంచి బీజేపీ ఎలా కోలుకుంటుందో చూడాలి..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.