చంద్రబాబు బాధపడిన వేళ

నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ రాజీవ్‌‌కుమార్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. తెలంగాణకు ఏపీతో పోలికే లేదని కేసీఆర్‌ అన్నారు. నేను తెలంగాణ ప్రజలను నిందించను. కానీ ఏపీ ప్రజలేమీ తప్పు చేయలేదన్నారు చంద్రబాబు. ఆనాటి పాలకులు చేసిన పాపం ఫలితంగా తప్పులు దొర్లాయని చెప్పారు. అంతే కాదు… హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాబట్టే అందరూ వెళ్లారని, మళ్లీ అక్కడి నుంచి రమ్మనడమేంటి అని రాజీవ్ కుమార్ కు చురక అంటించారు. 1995కు ముందు.. తర్వాత హైదరాబాద్ ఎలా ఉందో పరిశీలిస్తే.. ఎవరు అభివృద్ది చేశారో తెలుస్తుందని చంద్రబాబు సవాల్ విసిరారు. 
ఆంధ్రా పాలకులు తెలంగాణను విధ్వంసం చేశారన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీనియర్‌ ఐఏఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం తప్పు పట్టారు. హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేశారన్న కేసీఆర్‌ వ్యాఖ్య మంచిది కాదని మరోవైపు ఏపిఐఐసి చైర్మన్ కృష్ణయ్య హితవు పలికారు. అభివృద్ధిలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌కు పోలికే లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యల పై దుమారం రేగుతోంది. విభజనలో యూపీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లే ఆంధ్రప్రదేశ్‌ ఇబ్బంది పడుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అట్టడుగున ఉన్నామని.. ఇంకా రూ.35వేల ఆదాయం పెరిగితేనే పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయికి చేరుకుంటామని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు వల్లనే హైదరాబాద్ ఐటీలో అగ్రగామిగా నిలిచిందని మంత్రి కేటీఆర్ చెప్పాడు. కానీ తండ్రి కేసీఆర్ ఆ మాటలను ఒప్పుకోవడం లేదు. బాహాటంగా చంద్రబాబు పనితీరును మెచ్చుకుంటే తెలంగాణ నుంచి తమకు ఓట్లు రావానే కారణంతోనే ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో రెచ్చగొట్టడం కేసీఆర్ కు కొత్తేం కాదు. అందుకే ఇప్పుడు ఏపీ పాలకులు, ప్రజల పై ఇష్టం వచ్చినట్లు కేసీఆర్ కామెంట్లు చేస్తున్నాడంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.